టాలీవుడ్
ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న
యువ నటులలో
కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన తాజాగా "క" అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ ని
అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను ఈ
సినిమా విడుదలకు ఒక రోజు ముందు అనగా
అక్టోబర్ 31 వ తేదీనే ప్రదర్శించారు. ఇకపోతే ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ తోనే మంచి టాక్ వచ్చింది. దానితో దానితో ఈ
మూవీ కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.
ఇకపోతే ఈ
మూవీ కి
అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయిన సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ థియేటర్లను కేటాయించారు. దానితో మొదటి నుండి కూడా ఈ సినిమాకు మంచి టాక్ వస్తే ఈ
మూవీ యొక్క
థియేటర్ కౌంటు ను చాలా వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది జనాలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సినిమాకు మంచి టాక్ రావడం , కలెక్షన్లు చాలా స్టడీగా వస్తూ ఉండటంతో ఈ
మూవీ యొక్క
థియేటర్ కౌంటును ఇప్పటికే పెంచేశారు.
తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ప్రకటించారు. ఆ అప్డేట్ ప్రకారం పబ్లిక్ డిమాండ్ ప్రకారం 186 కొత్త స్క్రీన్ లను "క"
మూవీ కి యాడ్ చేసినట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ
పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు కొత్తగా 186 స్క్రీన్ల ను జోడించడంతో ఈ
మూవీ కలెక్షన్లు కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.