తమిళ్లో "క" కి ఒక్క స్క్రీన్ కూడా ఇవ్వలేదు.. ఆ విషయం చెబుతూ ఎమోషనల్ అయిన కిరణ్ అబ్బవరం..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు పెరిగింది. కానీ ఆ తర్వాత ఈయన వరస పెట్టి సినిమాలలో నటించినప్పటికీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి.

చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర దారుణమైన పరాజయాలను ఎదుర్కున్నాయి. దానితో ఈయన క్రేజ్ చాలా వరకు తగ్గింది. అలాంటి సమయంలో ఈయన "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక మొదటి నుండి కూడా ఈ సినిమాపై మూవీ యూనిట్ చాలా పాజిటివ్ గా ఉండడం , అదే స్థాయిలో ప్రమోషన్లను చేయడం ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను తెలుగు లోనే విడుదల చేస్తున్నాము అని కిరణ్ ప్రకటించాడు.

ఇక తమిళ్లో మాత్రం థియేటర్స్ దొరకక ఈ సినిమాను విడుదల చేయడం లేదు అని ప్రకటించాడు. ఇక తాజాగా ఈ రోజు కిరణ్ మాట్లాడుతూ ... తమిళనాడులో తెలుగు భాషలో కూడా "క" ఒక్క స్క్రీన్ లో కూడా విడుదల కాలేదు. ఎంతోమంది "క" మూవీని తమిళనాడులో విడుదల చేయండి అని అడుగుతున్నారు. కనీసం 10 స్క్రీన్ లైన తమిళనాడులో "క" మూవీకి ఇవ్వండి అని ఆయన అన్నాడు. ఇక ప్రస్తుతం ఈ స్పీచ్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: