టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతటి ఘనత సాధించారో మనందరికీ తెలుసు.. ఈయన పుష్ప మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయి లో తన ప్రత్యేకత చాటుకున్నాడు.. ప్రస్తుతం ఈయన ను దేశ విదేశాల్లో కూడా పుష్ప, పుష్ప అంటూ ఎంతో మంది అభిమానులు ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి బన్నీ సినిమా కెరియర్ పరంగా ఎంతో దూసుకుపోతున్నారు. అలాంటి బన్నీ పర్సనల్ లైఫ్ నుంచి చాలామంది కి తెలియదు. ఆయన తన భార్య స్నేహారెడ్డిని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అలాంటి వీరు లైఫ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కంటే ముందే ఒక అమ్మాయితో లవ్ లో పడ్డారట. ఈ విషయాన్ని ఆయనే ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 ఫినాలే ఈవెంట్ లో బయటపెట్టారు..
అయితే ఈ ప్రోగ్రామ్స్ సందర్భంగా శృతి నందూరి అనే అమ్మాయి పర్ఫామెన్స్ చూసినటువంటి బన్నీ ఫిదా అయిపోయారట.. వెంటనే తన లైఫ్ కు సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్ ను పంచుకున్నారట.. నా మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతి అని, ఆమెంటే నాకు ప్రాణం అని చెప్పారట.. అయ్యో పేరు బయట పెట్టేసాను ఇది నా భార్యకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలి అంటూ బన్నీ కాసేపు బాధపడిపోయారట..
ఈ విధంగా స్నేహ రెడ్డి కంటే ముందు ఆయన మరో అమ్మాయి ని లవ్ చేసిన విషయాన్ని ఒప్పుకోవడంతో సోషల్ మీడియా లో అమ్మాయి ఎవరై ఉంటుందా అని వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు నేటిజన్స్. ఇక స్నేహ రెడ్డి విషయానికి వస్తే.. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.