కృష్ణ- శ్రీదేవి జోడికి ఆరంభం అక్కడేనా..?

Divya
బుర్రపాలెం అనే ఊరు గుంటూరు జిల్లాలోని తెనాలి పక్కన ఉన్నది.. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇదే ఊరికి చెందిన వారు కావడంతో ఈ ఊరి పేరు మరింత పాపులారిటీ అందుకుంది. తన ఊరి పేరు చిరస్థాయిగా మిగిలిపోవాలని ఈ సినిమా టైటిల్స్ తోని సినిమా తెరకెక్కించారు. అందుకే కొన్ని చిత్రాలలో టైటిల్స్ లో కానీ సినిమాలలో కానీ బుర్రెపాలెం బుల్లోడు అనే విధంగా దర్శక నిర్మాతలు పెడుతూ ఉంటారు. అలా గుంటూరు జిల్లా వాళ్ళ సినిమా అనే విధంగా బుర్రెపాలెం అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంలో హీరోగా కృష్ణ నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బీరం మస్తాన్ రావు తెరకెక్కించారు. ఆయన కూడా గుంటూరు వారు కావడం గమనార్హం.

సినిమా అవుట్డోర్ షూటింగ్ చాలావరకు ఎక్కువగా బుర్రపాలెంలోనే తీశారట. కృష్ణ, శ్రీదేవి జోడిగా ఈ సినిమాతోనే మొదట ఆరంభం అయ్యిందట. ఈ సినిమా తర్వాత దాదాపుగా 30 చిత్రాలలో కలిసి నటించారట. నవంబర్ 16, 1979లో వచ్చిన ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా హిట్ తాకుతో దూసుకుపోయిందట. దాదాపుగా వంద రోజుల వరకు ఈ సినిమా ఆడిందట. కృష్ణ ఫుల్ జోష్తో ఈ సినిమాలో కనిపించడమే కాకుండా శ్రీదేవి అల్లరి పిల్లగా చాలా హుషారుగా కనిపించిందట.

ఈ సినిమా కథను జంధ్యాల, సత్యానందులు అందించారట. జంధ్యాల డైలాగులు రాయగ చక్రవర్తి సంగీతాన్ని అందించారట. ఈ చిత్రంలో పాటలన్నీ కూడా అప్పట్లో మంచి పాపులారిటీ అందుకున్నాయట. సుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటలు కూడా ఇప్పటికీ అభిమానులను చెరగని ముద్ర ఉన్నాయట.

బుర్రెపాలెం చిత్రంలో కృష్ణ లెక్చరర్ గా కనిపించగా , చాలా స్టైలిష్ గా అద్దాలు పెట్టుకొని కనిపిస్తారు. ఈ చిత్రంలోని నాగభూషణం, అల్లు రామలింగయ్య, జయమాలిని, గిరిబాబు ఇలా ఎంతోమంది నటీనటులు ఇందులో నటించారట. ఈ చిత్రంలో సత్యనారాయణ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఇప్పటికి శ్రీదేవి, కృష్ణ అభిమానులు ఈ సినిమాను ఎన్నోసార్లు చూస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: