గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Divya
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది ఇటీవలే సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్.. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చి తక్కువ సమయంలోనే వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే అట్టహాసంగా నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఈ వేడుక ఇరువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరగడం జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అలాగే కళ్యాణ్ రామ్ వెంకటేష్ తదితరులు కూడా ఈ వేడుకకు వచ్చారు.

ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది .నార్నే నితిన్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ కుమారుడు.. 2023 లో వచ్చిన మ్యాడ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.  ఇటీవలే ఆయ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే మ్యాడ్-2 లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే సడన్గా పెళ్లి పీటలు లేకపోతున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా ఎన్టీఆర్ ఫ్యామిలీ నిలిచింది.

ఇక నార్ని నితిన్ చేసుకోబోయే అమ్మాయి విషయానికి వస్తే.. ఈమె పేరు శివాని..తల్లూరు వెంకట కృష్ణ ప్రసాద్ , స్వరూపాల కుమార్తె.. మరి నార్ని నితిన్, శివాని ది ప్రేమ వివాహమా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే వినిపిస్తున్న సమాచారం మేరకు  శివాని ఫ్యామిలీ దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉందని అందుకే వెంకటేష్ కూడా వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి త్వరలోనే నార్నే నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. మరి వివాహం తర్వాత కూడా తన సినిమాలతో మరింత దూకుడుగా ముందుకు వెళ్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: