50 ఏళ్ల వయసు దాటిన నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదని ఆమె అభిమానుల్లో ఒక అసంతృప్తి అయితే ఉంది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయినట్టు బీటౌన్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ నగ్మా పెళ్లి చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరు? నిజంగానే నగ్మా పెళ్లాడబోతుందా.. అనేది ఇప్పుడు చూద్దాం. నగ్మా పెళ్లి చేసుకుంటుంది అంటే ఆమె కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా అభిమానులే ఆనందపడతారు. ఎందుకంటే నగ్మా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుండి ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ముగ్గురు పెళ్లయిన వాళ్లతో డేటింగ్ చేసిన నగ్మా ఏ ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంది. మొదట నగ్మా స్టార్ క్రికెటర్ అయినటువంటి సౌరబ్ గంగూలీతో డేటింగ్ చేసింది. అయితే వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.
ఇక ఈ వార్త వినిపించిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.ఇక ఆ తర్వాత సౌత్ నటుడు అయినటువంటి శరత్ కుమార్ ప్రేమలో కూడా నగ్మా పడింది. అయితే అప్పటికే రాధికతో శరత్ కుమార్ కి పెళ్లి అయింది.ఈ విషయం తెలిసిన రాధిక నగ్మాని తరిమికొట్టడంతో చెన్నై మొహం కూడా చూడకుండా పారిపోయిందట. ఇక వీళ్లిద్దరు మాత్రమే కాకుండా భోజ్ పూరి నటుడు రవికిషన్ తో కూడా నగ్మా ఓ సినిమాలో చేసే సమయంలో పరిచయం ఏర్పడి అధికాస్తా ప్రేమ వరకు వెళ్లి ఇద్దరూ డేటింగ్ చేశారు.కానీ ఈ డేటింగ్ వార్తలపై స్పందించిన రవి కిషన్ అలాంటిదేమీ లేదు. అది రూమర్ మాత్రమే అని చెప్పారు.
కానీ వీరిద్దరి మధ్య డేటింగ్ నడిచింది అనేది మాత్రం భోజ్ పూరి సినీ ఇండస్ట్రీ వాళ్లకు తెలుసు.అయితే ముగ్గురితో డేటింగ్ చేసి ఎవరిని పెళ్లి చేసుకొని నగ్మా తాజాగా బాలీవుడ్ నటుడిని పెళ్లాడబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ లో ఉన్న ఓ హీరోతో నగ్మా ప్రేమలో పడిపోయిందట. ప్రస్తుతం ఆ హీరో కూడా నగ్మాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. మరి బాలీవుడ్ హీరోతో నగ్మా పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త నిజం అవ్వాలని నగ్మా అభిమానులు కోరుకుంటున్నారు