గబ్బర్ సింగ్ తో పటాస్ లా పేలిన అభిమన్యు.. చివరికి తుస్సుమన్నాడుగా..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో  ‘గబ్బర్ సింగ్’ సినిమా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. దాదాపు 10 ఏళ్ల పాటు పవర్ స్టార్ కి  బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా ఆయనకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది.సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.. పవర్ స్టార్ కెరీర్ లోనే గబ్బర్ సింగ్ తిరుగులేని విజయం సాధించింది.. అయితే గబ్బర్ సింగ్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ కి రీమేక్ గా తెరకెక్కినా కూడా ఒరిజినల్ మూవీ కంటే ఎక్కువగా ఈ సినిమా అధిక ప్రేక్షకాధరణ పొందింది..ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు విలన్ గా నటించిన అభిమన్యు సింగ్ కి కూడా మంచి పాపులారీటి వచ్చింది.. పవర్ స్టార్ ని ఢీ కొట్టే విలన్ గా అభిమన్యు సింగ్ అద్భుతంగా నటించాడు.. సిద్దప్ప గా అభిమన్యు విలనిజం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..

1994లో టెలివిజన్ రంగం ద్వారా అడుగుపెట్టిన అభిమన్యు సింగ్.. ఆ తరువాత 2001లో విడుదలైన హిందీ సినిమా ''ఆక్స్'' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, తెలుగు, తమిళం, భోజ్‌పురి వరుస సినిమాల్లో నటించాడు.. 2010 లో వచ్చిన రక్తచరిత్ర 2,బెజవాడ వంటి సినిమాల్లో విలనిజంతో మెప్పించిన అభిమన్యు గబ్బర్ సింగ్ మూవీలో విలన్ ఛాన్స్ అందుకున్నాడు.. ఆ సినిమాతో అభిమన్యు తెలుగులో స్టార్ విలన్ గా మారాడు.. గబ్బర్ సింగ్ ఇచ్చిన క్రేజ్ తో అభిమన్యు వరుస సినిమాలు చేసిన అంత గుర్తింపు రాలేదు..మెయిన్ విలన్ గా కంటే సైడ్ విలన్ గా ఎక్కువ సినిమాలలో నటించాడు.. టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ,అలాగే రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన దేవర సినిమాలో అభిమన్యు విలన్ గా నటించాడు..కానీ అవి సైడ్ విలన్ రోల్స్ కావడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: