విలన్ పాత్రలకే కొత్త గుర్తింపు తెచ్చిన ఆశిష్ విద్యార్థి.. సినిమాల్లో చాన్స్‌లు రాకపోవడానికి కారణం ఇదే..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది గొప్ప నటులు, ఆర్టిస్టులు ఉన్నారు .. అలా వారిలో సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కూడా ఒకరు .. ఎన్నో సినిమాలలో ఆశిష్ విద్యార్థి విలన్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి నెగటివ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో ఆశిష్ విద్యార్థి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు . 1991లో కాల్ సంద్యా అనే  హిందీ సినిమాతో చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు . ఆ తర్వాత పాపే నా ప్రాణం అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా పరిచయం అయ్యాడు. అయితే పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్‌ బాగా పెరిగింది ఆయనకు బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు వచ్చాయి.

వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఆశిష్ కు ఈ మధ్య కాలం లో ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం హీరోలకు తండ్రిగా కమీడియన్ గా సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నాడు. అయితే ఆశిష్ కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , తమిళం , మలయాళం , బెంగాలీ , ఒడియా , ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించాడు. అలాగే విలన్ పాత్రలో ఉన్నప్పటికీ అతని అద్భుతమైన నటనా నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు అయ‌న కేరీర్‌లో సుమారు 200 చిత్రాలలో నటించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆశిష్ విద్యార్థికి అవకాశాలు కరువయ్యాయి. సినిమా ఛాన్స్ లు లేక ఎదురు చూస్తున్నారు ఆశిష్ విద్యార్థి. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవకాశాలు తగ్గడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను బతికే ఉన్నాను. నాకు కూడా సినిమా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఛాన్స్ లు ఇవ్వని అంటూ కామెంట్లు చేశారు. ఆ కామెంట్స్ పై ఇప్పుడు మరోసారి స్పందించారు ఆశిష్. నేను చాలా భాషల్లో సినిమాలు చేశాను. కేవలం విలన్ గానే కాదు ఎన్నో మంచి మంచి పాత్రలు కూడా చేశాను. కానీ నన్ను ఇప్పటికీ విలన్ గానే చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయనకు సినిమాల్లో అవకాశాలు అయితే రావట్లేదు.. అలాగే ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి.. 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవటం.. ఇలా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన మళ్ళీ చిత్ర పరిశ్రమలో బిజీ నటుడుగా మారుతారు లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: