'పశుపతి'గా భంబేలెత్తించి...చరగని ముద్రతో సినిమాలకు దూరం అవ్వడానికి కారణం.?

FARMANULLA SHAIK
సోనూ సూద్‌ పంజాబ్‌లోని మోగాలోజూలై 30, 1973న ఓకమధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శక్తి సాగర్‌ సూద్‌ వ్యాపారం చేసేవారు. తల్లి సరోజ్‌ సూద్‌ ఉపాధ్యాయినిగా పనిచేసేది.సోనూ సోదరి మోనికా సూద్‌ ప్రస్తుతం సైంటిస్టుగా పనిచేస్తున్నారు.ఇదిలావుండగా సోనూసూద్ సినిమా ఇండస్ట్రీలోకి దక్షిణాదినుంచే ఎంట్రీ ఇచ్చాడు. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మూడు సంవత్సరాలకు బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.ఆతరువాత సోనూ సూద్ 1999లో వచ్చిన కల్లాజగార్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.ఆతరువాతనాగబాబు,జయసుధ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హాండ్స్ అప్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సోనూసూద్. ఆ సినిమాలో విలన్ రోల్ చేసిన సోనూ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకున్నారు.సోనూ సూద్ కెరీర్ ని మలుపు తిప్పిన సంవత్సరంగా 2005ని చెప్పుకోవాలి. ఆ ఏడాది ఆయన నటించిన రెండు చిత్రాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. ఒకటి పూరి తెరకెక్కించిన సూపర్ కాగా రెండు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు. ఆ రెండు చిత్రాలలో సోనూ హీరోలకు సమానమైన పాత్రలు చేశారు.ఇదిలావుండగా తెలుగులో అరుంధతి సినిమాలో సోనూసూద్ నటన ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ చిత్రంలో ఆయన పశుపతి పాత్రలో జీవించాడు.ఏకంగా ఈ సినిమాకి గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డు కూడా వచ్చింది.ఈ సినిమాతర్వాత సోనూ పాపులారిటీతో పాటు టాలీవుడ్ లో ఆఫర్స్ కూడా ఎక్కువయ్యాయి. 

అరుంధతి సినిమా సోనూ కెరీర్కు చాలా హెల్ప్ అయ్యింది. బాలీవుడ్ నటుడు అయిన సోనూ ఈ సినిమాలో తన నటనతో అబ్బురపడిచాడు. హీరోయిన్ గా అనుష్కకు ఎంత క్రేజ్ వచ్చింది సోనూ సూద్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ వచ్చింది.అరుంధతి సినిమాను కోడిరామకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే సన్నివేశాలతో ఆద్యంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో పశుపతిగా సోనూ నటించి మెప్పించారు. అమ్మ బొమ్మాళి.. పిందె పండయిందిగా .. అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పటికి ఫేమస్.ఇదిలావుండగా ఇక ఆరోగ్యం, ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ద చూపించే సోనూ సూద్ కఠిన నియమాలు పాటిస్తారు. కేవలం శాకాహారం తీసుకుంటారు. ధూమపానం మరియు మద్యపానం చేయరు.ఇక సోనూసూద్ ప్రస్తుతం కష్టం, సహాయం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.. కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు చేర్చిన సోనుసూద్ వారి పాలిట దేవుడు అయ్యాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో హీరో అనిపించుకుంటున్నాడు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని చూపించాడు సోనుసూద్.ప్రస్తుతం సోనూసూద్ సేవా కార్యక్రమాలలో నిమగ్నమై సినిమాలపై ఫోకస్ తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: