ప్రకాష్ రాజ్ ను పట్టించుకోవడం లేదా... సినిమాల కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా..?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజు గురించి తెలియని వారు ఉండరు. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ నటుడిగా ఆయన...రాణిస్తున్నారు. నటుడు గానే కాకుండా చాలా సినిమాలకు దర్శకుడుగా కూడా చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు నటుడు కాకపోయినా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆయనకు... చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమాల ఆఫర్లను సద్వినియోగం చేసుకొని విలక్షణ నటుడిగా మారిపోయారు.
అచ్చి తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు... ఎక్కువ శాతం విలన్ పాత్రలని  ప్రకాష్ రాజ్ చేయడం జరిగింది. మరో కమల్ హాసన్ లాగా...  ప్రతి సినిమాలో తన నటనతో రాణిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్.  59 సంవత్సరాలు ఉన్న ప్రకాష్ రాజ్... తన చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అదే సమయంలో సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. కర్ణాటకలోని  మైసూర్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ రాజ్... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
 అదే సమయంలో సినిమాలలో విలన్ గా రాణిస్తూ...  చాలా హిట్లు అందుకున్నారు ప్రకాష్ రాజు. నేను మోనార్క్ అంటూ.. ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి. తన నటనలో.... విలనిజం తో పాటు కామెడీ కూడా చూపించారు. అంతేకాకుండా...  చాలా సినిమాలలో విలన్ గా నటిస్తూనే హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించారు. అలాగే మంచి ఫాదర్ క్యారెక్టర్ కూడా చేసిన చాలా సినిమాలు ఉన్నాయి.
 ఇటు ఒక అన్నగా, తండ్రి పాత్రలో, విలన్ గా, ఓ శాడిస్ట్ తండ్రిగా... ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఏ పాత్ర ఇచ్చిన.... దానికి న్యాయం చేసేవాడు ప్రకాష్ రాజ్. అయితే అలాంటి ప్రకాష్ రాజ్ కి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.  దీనికి కారణం ఆయన రాజకీయాల్లో వేలు పెట్టడమే. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రతిసారి మాట్లాడుతూ... టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. సినిమాల కంటే రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇలాగా... టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను పోగొట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: