ఒకవేళ రాజమౌళి డైరెక్టర్ కాకుండా ఉంటే .. ఆ పని చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యి ఉండేవాడా..?

Thota Jaya Madhuri
లైఫ్ లో మనం అనుకున్నట్లు అన్నీ జరిగిపోతే అది లైఫ్ గానే ఉండదు. కొన్ని చివాట్లు..కొన్ని ట్వీస్ట్ లు..కొన్ని రాద్ధాంతాలు..కొన్ని ఏడుపులు అన్ని ఉంటేనే అది లైఫ్. లైఫ్ లో మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి.  ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సిన పొజిషన్ ఉంటుంది . అలాంటి వాటిని సక్సెస్ఫుల్గా ఎదుర్కొన్న వాడే  రియల్ హీరో అవుతాడు. అది ఎవరైనా సరే ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు "రాజమౌళి".


దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . జక్కన్న అంటూ ముద్దుగా ట్యాగ్ చేయించుకునేటటువంటి రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబు సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు . ఈ సినిమా కోసం ఏఐ టెక్నాలజీని వేరే లెవెల్ లో ఉపయోగించడానికి ప్లాన్ చేస్తున్నాడు . దానికోసం స్పెషల్ గా క్లాసెస్ కూడా తీసుకుంటున్నారట . ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన ప్రతి వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రాజమౌళి ఒకవేళ డైరెక్టర్ కాకుండా ఉంటే ఏమై ఉండేవాడు..? అనే విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు.


మనకు తెలిసిందే రాజమౌళి ఏమి కూడా  రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోలేదు . దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ..ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది . ఆయన డైరెక్టర్ గా ఎదగడానికి  చాలా కష్టపడ్డారు . ఇదే విషయాని ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆయనకు సంపాదన లేనప్పుడు రమా రాజమౌళి ఉద్యోగం చేసి ఆయనకు డబ్బులు ఇచ్చింది అని కూడా చెప్పుకొచ్చాడు . ఒకానొక టైంలో రాజమౌళి ఇక  డైరెక్టర్ గా సెటిల్ అవ్వలేను అంటూ భయపడి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకోనైనా సరే కుటుంబాన్ని పోషించాలి అంటూ డిసైడ్ అయ్యారట . కానీ రమా రాజమౌళి ఒప్పుకోలేదట. "నువ్వు అనుకున్న పని ట్రై చేయ్యి " అంటూ బాగా సపోర్ట్ చేసిందట. ఆ కారణంగానే రాజమౌళి ఇప్పుడు ఇంతటి స్టార్ పొజిషన్లో ఉన్నాడు అంటున్నారు అభిమానులు .  రాజమౌళి మంచోడే కాదు మహా మొండోడు కూడా అని అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: