చిరంజీవికి జాతీయ అవార్డు రాకుండా.. వాళ్లే అడ్డుకున్నారు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారూ అన్న విషయం తెలిసిందే. తన డాన్సులతో తను నటనతో ఏకంగా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఇక మాస్ హీరోగా ఒకరకంగా ఇండస్ట్రీని ఏలేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో 150 పైగా సినిమాల్లో నటించారు. అయితే ఇందులో ఇండస్ట్రీ హీట్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఇక మెగాస్టార్ ఎక్కువగా మాస్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తూ వచ్చారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా ఎక్కువగా మాస్ ఓరియెంటెడ్ సినిమాలను చేసినప్పటికీ.. ఇక ఎన్నో  క్లాసిక్ హిట్స్ కూడా మెగాస్టార్ కెరియర్ లో ఉన్నాయి అని చెప్పాలి. ఇక అందులో ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇక ఇలాంటి క్లాసిక్ సూపర్ హిట్ సినిమాలలో కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు మూవీ కూడా ఒకటి. ఇది మెగాస్టార్ కెరియర్ లోనే ఒక మాస్టర్ పీస్ ఇలాంటి మూవీ.  ఇక ఇందులో మెగాస్టార్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ సినిమాలో చిరంజీవి నటన ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ నటనకు గాను ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును కూడా ఇచ్చి గౌరవించింది.

 అయితే మెగాస్టార్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే దీనిపై ఆ చిత్ర నిర్మాత ఏడిద రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని చెప్పుకున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో ఆపద్బాంధవుడు ఒక క్లాసిక్ మూవీ. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులు అద్భుతం అని కొనియాడాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కాయమని అందరం భావించారు. అవార్డు ప్రకటనకు ముందు మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అయితే నార్త్ సౌత్ అనే విభేదాలు చూసి చిరంజీవికి అవార్డు రానీకుండా చేశారు.  ఇప్పటికంటే అప్పట్లోనే ఈ వైరుధ్యాలు ఎక్కువ. లేదంటే తెలుగులో తొలి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు  చిరంజీవి గారి పేరు మీదే ఉండేది అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: