'క' సినిమాలో.. చూపించిన ఆ ఊరు నిజంగానే ఉంది.. ఎక్కడ తెలుసా?

praveen
సాధారణంగా సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఒక మాయ లోకం. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపించడం సినిమా వాళ్ళ పని. ఏకంగా థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకున్ని మూడు గంటల పాటు బోరు కొట్టకుండా ఎంటర్టైన్ చేయడమే వాళ్ళ టార్గెట్. అందుకే ఇక సినిమా కోసం  కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి ఇక సినిమాలను నిర్మిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు అవసరమైతే ఏకంగా ఊర్లకు ఊర్లో నిర్మించడం కూడా చూస్తూ ఉంటాం.

 సినిమాకి అవసరమైతే ఏకంగా సముద్రాలను కూడా  టెక్నాలజీని ఉపయోగించుకుని తయారు చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏకంగా ఊరు ఫీల్ రావడానికి పెద్దగా సెట్స్ వేయడం కూడా చూస్తూ ఉంటాం. అందుకే సినిమాలో కనిపించింది నిజమా అబద్దమా అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. దాదాపుగా సినిమాలో చూపించినవన్నీ కూడా అబద్ధాలు అని కేవలం కల్పితాలు మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'క'మూవీలో కూడా కొదురుపాక అనే ఒక విలేజ్ ని చూపిస్తారు. అయితే ఇలాంటి విలేజ్ నిజజీవితంలో ఉండదని కేవలం సినిమా కోసం మాత్రమే ఇది క్రియేట్ చేసి ఉంటారని అందరూ అనుకున్నారు.

 అయితే ఆ ఊరిలో కేవలం మూడు గంటలకే చీకటి పడిపోతుంది అంటూ సినిమాలో చూపించారు. అయితే క సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉంది. తెలంగాణలోని పెద్దపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు జాముల కొదురుపాక అనే ఊరిలో ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు జాములే ఉంటాయి. సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ చీకటి అవుతుంది. నాలుగు దిక్కుల ఎత్తయిన కొండలు ఉండి మధ్యలో ఊరు ఉండడంతో సూర్యుడు ఆ కొండల చాటుకు వెళ్లడంతో నీడపడి ఇక నాలుగు గంటలకే చీకటి అయిపోతుంది. అయితే ఈ విషయం తెలిసి ఇప్పుడు అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: