నటరత్న ఎన్టీఆర్ రెండుసార్లు చూసిన ఏకైక తెలుగు సినిమా ఏమిటో తెలుసా..!
ఇక తన జీవితంలో రెండుసార్లు చూసిన ఏకైక సినిమా కూడా ఇదేనట. అలానే ఈ సినిమాకి ఎన్టీఆర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. విజయశాంతి సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ మీద నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలుగా ఆమె నటించింది. అలాగే అప్పట్నుంచి ఎన్టీఆర్ విజయశాంతి కి మంచి అనుబంధం ఉండేది .. ఆమె ఇంటి నుంచి పంపించే లంచ్ బాక్స్ ని కూడా ఆయన తినే వారట. విజయశాంతి ఎక్కడ కలిసిన ఆమెకు మంచి ఆతిథ్యం ఇచ్చేవారట .
ప్రతిఘటన సినిమా కుల వివక్ష అనగారిన వర్గాల, దుస్థితి వంటి సామాజిక సమస్యల చుట్టూ సినిమా ఉంటుంది. అలాగే రాజకీయ భావజాలానికి కూడా దగ్గరిగాఉంటుంది. న్యాయం సమానత్వం కోసం పోరాడాలని సినిమా సందేశం. ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట. ఈ సినిమా 1985 లో రిలీజ్ అయింది ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన టైంలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయింది. ఆమె అద్భుతమైన నటనకి విజయశాంతికి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు ని కూడా ఇచ్చారు. నంది అవార్డు ని స్వయంగా ఎన్టీఆర్ విజయశాంతికి అందించి ఆమెని అభినందించారు .