ముందు శోభనం.. తర్వాతే పెళ్లి అంటూ పచ్చిగా మాట్లాడిన హెబ్బా పటేల్.?

Pandrala Sravanthi
కుమారి 21f సినిమాతో టాలీవుడ్ కి బోల్డ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది అని హెబ్బా పటేల్ ని చూసి అందరూ అనుకున్నారు.ఈ సినిమాలో హెబ్బా పటేల్ అందాలకు కుర్రకారైతే మతులు పోగొట్టుకున్నారు. ఇక ఈమె నెక్స్ట్ ఏ సినిమా తో వస్తుందా అని ఎదురు చూసేంతలా ఈమెపై క్రష్ పెంచుకున్నారు.అలా కుర్రకారుకి ఎంతో ఇష్టమైన హెబ్బా పటేల్ ఏ సినిమాలో అయినా సరే చాలా బోల్డ్ గా నటిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఎక్కువగా ఆఫర్లు అయితే ఎక్కువగా రావడం లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన ధూంధాం సినిమా నవంబర్ 8న విడుదల కాబోతుంది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో పాల్గొన్న హెబ్బా పటేల్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది.

అయితే ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న హెబ్బా పటేల్ పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదని పెళ్లి చేసుకోవాలని లేదని, ఒకవేళ చేసుకుంటే అలాంటి వాడినే చేసుకుంటాను అంటూ తాజా ప్రమోషన్స్ లో చెప్పింది. మరి ఇంతకీ హెబ్బా పటేల్ పెళ్లిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో ఇప్పుడు చూద్దాం.. హెబ్బా పటేల్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం అన్నీ ఆలోచించే చేసుకుంటాను.అయితే గతంలో నేను పెళ్లి చేసుకోను అని అందరికీ చెప్పాను. అయితే ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాను. కానీ ఒకవేళ నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటాను.

ఇక నచ్చిన అబ్బాయి అంటే అతనిలో అన్ని క్వాలిటీస్ నాకు నచ్చేలా ఉండాలి. ముఖ్యంగా మొదట ఆయనతో డేటింగ్ చేసిన తర్వాతే అన్ని అర్థం చేసుకొని ఓ అండర్స్టాండింగ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను.ఒకవేళ ఆ డేటింగ్ సమయంలో ఇద్దరు మధ్య ఏ చిన్న విషయం కుదరదు అనిపించినా కూడా అక్కడికి తోనే ఆ అబ్బాయికి బ్రేకప్ చెబుతాను.కానీ ఈ క్వాలిటీస్ అన్ని ఉన్న అబ్బాయి దొరికే వరకు చూద్దాంలే అంటూ హెబ్బా పటేల్ మాట్లాడింది. అయితే హెబ్బా పటేల్ చేసిన బోల్డ్ కామెంట్స్ పట్ల నెటిజెన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ఈ హీరోయిన్ కి ముందు శోభనం తర్వాతే పెళ్లి కావచ్చు అంటూ ఈమె మాట్లాడిన మాటలు వైరల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: