చిరు ఠాగూర్ 100 రోజుల కేంద్రాల లెక్క ఇదే.. అప్పట్లోనే చరిత్ర సృష్టించారుగా!
ఈ థియేటర్లలో కూకట్ పల్లి ఏరియాలోని విశ్వనాథ్ థియేటర్ కూడా ఉంది. ఉమ్మడి ఏపీలోని థియేటర్లలో 100 రోజుల పాటు సినిమా ప్రదర్శించబడటంలో ఆశ్చర్యం లేకపోయినా ఇతర రాష్ట్రాల్లోని థియేటర్లలో సైతం ఈ సినిమా 100 రోజులు ఆడటం గమనార్హం. బెంగళూరు, బళ్లారి, చిక్కబల్లాపూర్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఆడింది. ఠాగూర్ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రమణ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
ఠాగూర్ సినిమా క్లైమాక్స్ విషయంలో తమిళ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు మార్పులు చేశారు. తమిళంలో ఈ సినిమాను మురుగదాస్ తెరకెక్కించడం గమనార్హం. తెలుగులో కూడా మొదట ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ మురుగదాస్ కు దక్కగా కొన్ని కారణాల వల్ల ఆయన ఈ అవకాశాన్ని వదులుకున్నారు. ఈ సినిమా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన నాలుగో సినిమా కావడం గమనార్హం.
వినాయక్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఠాగూర్ ఒకటి అని చెప్పవచ్చు. ఠాగూర్ మూవీ ఇండస్ట్రీ హిట్ కాదు కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా రేంజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. చిరంజీవి ఇమేజ్ ను మార్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఠాగూర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకున్నారు.