ఏంటి ఆ తమిళ్ హీరో నిజంగానే సాయి పల్లవికి తరచూ ఫోన్లు చేస్తున్నాడా.. నిజంగానే సాయి పల్లవి ఆయన వల్ల ఒత్తిడికి గురవుతుందా అనేది ఇప్పుడు చూద్దాం.. సాయి పల్లవి తరచూ ఫోన్లు చేస్తున్న తమిళ హీరో ఎవరో కాదు ధనుష్.అయితే ఆయన సాయి పల్లవికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.. అమరన్ సినిమాతో హిట్టు కొట్టిన సాయి పల్లవి తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీని వేసుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది సాయి పల్లవి. అయితే ప్రేమమ్ సినిమాలో నటించిన తర్వాత ఎన్నో సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా సూర్య హీరోగా చేసిన ఎన్జీకే సినిమాలో కూడా సాయి పల్లవికి హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది.
అయితే ఈ సినిమా కి డైరెక్టర్ గా ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ పనిచేశారు.అయితే ఈ షూటింగ్ సమయంలో డైరెక్టర్ సెల్వా రాఘవన్ కి నటన నచ్చిందో లేదో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే షాట్ అయిపోవడంతోనే ఆయన ఎక్స్ప్రెషన్స్ లో నా యాక్టింగ్ బాగుందో లేదో అర్ధమయ్యేది కాదు. దాంతో ప్రతిసారి షాట్ అయిపోవడంతోనే భయపడే దాన్ని. అయితే ఈ షూటింగ్ జరిగిన మొదటి మూడు రోజుల్లో చాలా భయం వేసి షూటింగ్ నుండి పారిపోదాం అనుకున్నా.
కానీ ఆ తర్వాత ధనుష్ ఫోన్ చేసి మాట్లాడడంతో నేను సైలెంట్ అయిపోయాను. అయితే ధనుష్ తో అప్పటికే మారి 2 సినిమాలో హీరోయిన్ గా చేశాను. దాంతో ఆయనతో మంచి పరిచయం ఏర్పడింది. ఇక నేను ఎన్జీకే సినిమా చేసే సమయంలో తరచూ నాకు ధనుష్ ఫోన్ చేసి సెల్వా తో సినిమా ఎలా ఉంది అని అడిగే వారు. దాంతో నేను షూటింగ్ సెట్ లో నాకు జరిగిన అన్ని విషయాలు ఓపెన్ గానే ధనుష్ తో పంచుకునే దాన్ని. కానీ నా మాటలకు ధనుష్ నవ్వుకొని నువ్వేం భయపడకు సెల్వా నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అంతే అని నాకు ధనుష్ ధైర్యం చెప్పాడు అంటూ సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది.