డైరెక్టర్ శంకర్ కు అలాంటి ఫోటోలు పంపిన సీనియర్ బ్యూటీ..కట్ చేస్తే.?

FARMANULLA SHAIK
సినిమా ఇండస్ట్రీ లో ప్యాన్ ఇండియా అనే పదానికే అర్థం తీసుకువచ్చిన దర్శకుడు ఎవరైన ఉన్నారంటే అది కచ్చింతంగా తమిళ దర్శకుడు శంకర్. వరుస హిట్లను సాధిస్తూ స్టార్ దర్శకుడుగా ఎదిగారాయన. ముఖ్యంగా రోబో సినిమాతో శంకర్ తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లతో శంకర్ ప్యాన్ ఇండియా రేసు నుంచి తప్పుకున్నారు.ఇదిలా ఉంటే శంకర్‌కు ఓ తెలుగు నటి బికిని ఫొటోలు పంపించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి మరెవ్వరో కాదు కస్తూరి శంకర్.కస్తూరి అంటే తొందరగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. గృహలక్ష్మీ సీరియల్ నటి అంటే టక్కున గుర్తొస్తుంది.తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ఇలా సౌత్‌లోని నాలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అప్పట్లో క్షణం తీరిక లేకుండా గడిపేది. తెలుగులో నిప్పురవ్వ, గాడ్ ఫాదర్, చిలక్కొట్టుడు వంటి ఎన్నో సినిమాల్లో నటించింది.ఇక ఇప్పుడు గృహలక్ష్మీ సీరియల్‌తో కస్తూరీ ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ అయిపోయింది. నిజానికి సినిమాల్లో కంటే.. ఈ సీరియల్‌తోనే కస్తూరీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా మన ఇంట్లో అమ్మలు.. ఎంత పనున్నా సరే సీరియల్ టైమ్‌కు టీవీల ముందు వాలిపోతుంటారు.ఇక కస్తూరి ఫిల్మోగ్రఫిలో ఎన్ని సినిమాలున్నా.. భారతీయుడు సినిమాకు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

ఈ సినిమాలో కస్తూరి కమల్‌కు కూతురుగా, చెల్లెలిగా కనిపించింది. అంతేకాదు ఈ మూవీతోనే తమిళంలో కస్తూరికి మంచి బ్రేక్ దొరికింది.కాగా ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో ఓ సందర్భంలో చెప్పింది. భారతీయుడు సినిమా కోసం ముందు కస్తూరిని ఆడిషన్ చేశారట. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో సినిమా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయి, ఎలాగైనా ఈ అవకాశం దక్కించుకోవాలని అనుకుందట.అందుకోసం ఆడిషన్ అయ్యాక శంకర్‌ను ఇంప్రెస్ చేయాలని తన బికినీ ఫొటోలను పంపిందట. ఎలాగైనా తనే హీరోయిన్ అవ్వాలనుకుని అలా చేసిందట. కానీ అప్పుడే రంగీలా సినిమా రిలీజై.. అందులో ఊర్మిళ బికినీ ఫొటోలు పాపులర్ అయి అందరి దృష్టి ఆమె వైపు మళ్లిందని చెప్పుకొచ్చింది.భారతీయుడు సినిమాలో ఊర్మిళనే తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరికి మనీషా కోయిరాలను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. అయితే తనను మాత్రం చెల్లెలి పాత్రకు ఓకే చేశారట. అలా బికినీ ఫోటోలు పంపితే చెల్లెలి క్యారెక్టర్‌కు ఎంపిక చేశారని ఈ బ్యూటీ గతంలో జరిగిన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.ఇదిలావుండగా కస్తూరి అంటే.. సినిమాలతో పాటు కాంట్రవర్సీలకు కూడా దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈ నటి.. తెలుగు వారిపై చేసిన కామెంట్స్ దుమ్మురేపుతున్నాయి. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ సంచలన వాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: