ప్రభాస్ కి ఆ హీరోయిన్ తో నటించాలని ఉందా..? మనసులోని కోరికను బయటపెట్టిన డార్లింగ్..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోయిన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తుందంటూ..? ఎదురు చూసే ఒకే ఒక్క హీరో "ప్రభాస్". టాలీవుడ్ ఇండస్ట్రిలో రెబల్ స్టార్ గా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ట్యాగ్ చేయించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ కోట్లాదిమంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆయన దానికి సంబంధించిన గుడ్ న్యూస్ కాకుండా మిగతా వాటికి సంబంధించిన గుడ్ న్యూస్ అన్ని వినిపిస్తున్నారు.


ఇప్పుడు ఆయన చేతిలో అర డజనులి పైగానే సినిమాలు ఉన్నాయి . మరో మూడు ప్రాజెక్టులు ఓకే చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇదే గనుక నిజమైతే ఇక ప్రభాస్ పెళ్లి మ్యాటర్ గోవిందా గోవిందా అంటున్నారు జనాలు . కాగ గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు  సూటిగా ఆన్సర్ ఇచ్చారు. " మీరు ఏ హీరోయిన్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నారు ..?"అని ప్రశ్నించగా "సాయి పల్లవి" అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .


"హీరోయిన్ సాయి పల్లవి నటన బాగుంటుంది అని ..ఆమె డాన్స్ స్టైల్ ఇంకా ఇంకా బాగుంటుంది అని.. ఆమెతో  నటించాలి అనుకుంటున్నాను అని కానీ మా ఇద్దరికీ హైట్ మ్యాచ్ అవుతుందో లేదో అదే కొంచెం డౌట్ అవుతుంది డౌట్ గా ఆన్సర్ ఇచ్చాడు". ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.  అయితే రీసెంట్గా "అమరన్" మూవీ హిట్ అవ్వడంతో సాయి పల్లవి సంబంధించిన మరికొన్ని వార్తలను బాగా ట్రెండ్ చేస్తూ ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్తను కూడా సాయి పల్లవి ఫాన్స్ బాగా హైలెట్ చేస్తున్నారు . చూద్దాం  ఏ డైరెక్టర్ అయినా మేల్కొని ప్రభాస్ - సాయి పల్లవి కాంబోని సెట్ చేస్తే బాగుంటుందేమో అంటూ వెయిట్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎక్కడున్నాడో..? ఎప్పుడు ఆ సమయం మన ముందుకు తీసుకొస్తాడో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: