ఆ హీరో ని చూస్తే రామ్ చరణ్ కి అంత కుళ్లా..? ఇంత ఓపెన్ గా చెప్పేసాడు ఏంటి..?
అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 22వ తేదీ కర్ణాటకలోని మైసూర్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది . మొదటి షెడ్యూల్లోనే జాన్వీ కపూర్ తో భారీ రొమాంటిక్ సీన్స్ లో నటించబోతున్నారట. అయితే మొదటి నుంచి రామ్ చరణ్ కి తానే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి .. తానే గొప్పగా ఉండాలి.. తన స్థాయి ఫస్ట్ అనే విధంగా ఆలోచించడం ఎక్కువగా ఉండేదట. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాడు రామ్ చరణ్ .
మరీ ముఖ్యంగా ఒకానొక టైంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల మొదటి టఫ్ కాంపిటీషన్ నెలకొంది . ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో అంటూ బాగా ప్రచారం జరిగింది . అలాగే మెగా ఫాన్స్ చరణ్ నెంబర్ వన్ హీరో అంటూ బాగా ట్రెండ్ చేశారు . అయితే మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా రామ్ చరణ్ ..ఆంధ్రావాల సినిమా టైంలో ఎన్టీఆర్ ని అభిమానించే జనాల అరుపులు కేకలు చూసి షాక్ అయిపోయారట .ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు ఉంటే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కి ఎంతమంది జనాభా వచ్చారో మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఏ ఈవెంట్ కి కూడా అంతమంది జనాభా రాలేదు . నందమూరి ఫ్యాన్స్ ఆ రేంజ్ లో అల్లాడించేశారు . యాంకర్ సుమ సైతం బిత్తర పోయింది . పూరి జగన్నాథ్ కూడా షాక్ అయిపోయాడు . అప్పుడు ఎన్టీఆర్ ని చూసి రామ్ చరణ్ బాగా జలసీగా ఫీలయ్యాడట..!