అన్ స్టాపబుల్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య, సూర్య.. ప్రోమో వేరే లెవెల్!
భార్య జ్యోతిక లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య చెప్పుకొచ్చారు. కార్తి తన ఫోన్ లో నా పేరును అన్న అని ఫీడ్ చేసుకుంటాడని సూర్య ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. మొదట ఈ ప్రశ్నకు సూర్య ఔట్ ఆఫ్ సిలబస్ అంటూ రియాక్ట్ అయారు. కంగువా సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలయ్య సూర్య మధ్య సంభాషణ సరదాగా సాగడం గమనార్హం.
ఎవరినైనా ప్రేమించావా అని బాలయ్య అడగగా వద్దు సార్ ఇప్పుడు పెళ్లి అయిపోయిందంటూ సూర్య రియాక్ట్ అయ్యారు. షో అయిపోయాక ఇంటికి వెళ్లాలంటూ కామెంట్ చేశారు. కార్తీ ఒక హీరోయిన్ పై సూర్యకు క్రష్ ఉందని చెప్పగా ఆ హీరోయిన్ ఎవరనే విషయాలు ఫుల్ ఎపిసోడ్ లో రివీల్ అవుతాయేమో చూడాల్సి ఉంది. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య ఎంతోమంది విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నారు.
గతంలో ఓ అమ్మాయి స్టేజ్ పై మాట్లాడుతున్న వీడియో ప్లే కాగా ఆ వీడియో చూసి సూర్య కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో బాలయ్య సైతం ఎమోషనల్ అయ్యారు. అన్ స్టాపబుల్ షో ప్రోమో మాత్రం అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షో సీజన్4 ను సైతం సక్సెస్ చేయడంలో బాలయ్య పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.