తెలుగు సినీ పరిశ్రమలో బాలకృష్ణ అంటే సెన్సేషన్. తనదైన స్టైల్, ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే బాలకృష్ణ, అఖండ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాలయ్య క్రియేట్ చేసిన రేర్ రికార్డులు చాలా ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గత డిసెంబర్ 2న తెరకెక్కిన అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలను పోషించి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య చేసిన నటన అద్భుతమైనది. విడుదలైన కొద్ది రోజుల్లోనే అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.అఖండ సినిమా టీజర్, ట్రైలర్లు విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించాయి. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డు. బాలయ్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బాలయ్యకు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్లో కూడా మంచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానితో పాటుగా బోయపాటి శ్రీను కాంబోలో చేసిన సినిమా కావడంతో ‘అఖండ'కు భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకొని చూస్తే ఏకంగా.
రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో పాటుగానే ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసేశారు. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పోటెత్తాయి. దానితో ఈ మూవీ లాంగ్ రన్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకుంది. నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టించింది. ఇక నైజాంలో రూ.25.75 కోట్లు, సిడెడ్ లో రూ.18.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.32 కోట్లు, గుంటూరులో రూ. 6.95 కోట్లు, కృష్ణాలో రూ.3.90 కోట్లు, నెల్లూరులో రూ.2.95 కోట్లతో ఇక తెలుగు రాష్ట్రంలో రూ.74.33 కోట్లతో రికార్డు బ్రేక్ చేసింది ఆఖండ. కాగా మొత్తం రూ.130.50 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో 100 రోజుల్లో రూ. 74.33 కోట్లు ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.94 కోట్లు, ఓవర్సీస్లో రూ. 7.05 కోట్లు రాబట్టింది.
అంతే కాకుండా మరికొన్ని చోట్ల రూ. 2.95 కోట్లు అందుకున్న ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రూ. 94.27 కోట్లు షేర్ రూ. 156 కోట్లు గ్రాస్ వసూళ్లను చేసింది. ఇక ‘అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. కాగా ఈ సినిమా 100 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.27 కోట్ల వసూళ్లను అందుకుంటే ఈ సినిమా ఫలితంగా రూ. 40.27 కోట్లు లాభాలతో రికార్డును అందుకుంది. తద్వారా ఈ సినిమా ఈ మధ్యకాలంలో ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా బాలయ్య కెరీర్లో మునుపెన్నడూ చూడని భారీ కలెక్షను అందుకున్నారు బాలయ్య. ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోగా 40 కోట్ల లాభాలను కూడా అందుకుంది. ఈ సినిమాతో బాలయ్య మరోసారి తన నటనతో అందరినీ అబ్బురపరిచారు. అఖండ సినిమా సృష్టించిన రికార్డులు తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాయి.