తారక్ కంటే స్పీడ్ గా రజిని.. కానీ ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం ఓ టీ టీ లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. సినిమా విడుదల అయిన తర్వాత ఓ టీ టీ లోకి సినిమాలు చాలా కాలం తర్వాత వచ్చేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. నిర్మాతలకు ఓ టీ టీ ల ద్వారా వచ్చే డబ్బులు బాగా పెరిగాయి. సినిమా ధియేటర్లలో కాస్త అటు ఇటు అయినా ఓ టీ టీ , శాటిలైట్ హక్కుల ద్వారానే వారు లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇక ఓ టి టి సంస్థలు కూడా విడుదల అయిన తరువాత ఎంత తక్కువ కాలంలో స్ట్రీమింగ్ అవుతే అంత ఎక్కువ డబ్బులు ఇస్తారు అని తెలుస్తుంది.

దానితో సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని సినిమాలు చాలా తక్కువ కాలంలో ఓ టీ టీ లోకి వస్తున్నాయి. ఇక ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనుకునే మూవీ నిర్మాతలు , అలాగే స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన నిర్మాతలు సినిమా విడుదల అయిన తర్వాత 50 రోజులు , అంతకుమించిన రోజుల తర్వాత ఓ టీ టీ లోకి సినిమా వచ్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా 50 రోజుల తర్వాతే ఓ టీ టీ లోకి వస్తుంది అని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ మూవీ నవంబర్ 8 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాతే ఓ టీ టీ లోకి వస్తుంది అని అభిమానులు అనుకున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన వెట్టయన్ మూవీ కూడా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకున్న సినిమాలను 50 రోజుల తర్వాత ఓ టీ టీ లోకి ఇస్తే బాగుండేది అని ఈ ఇద్దరి హీరోల అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: