17 సంవత్సరాల తర్వాత ఆ హీరోయిన్ ను ఓకే చేసిన ప్రభాస్.. ఈ కాంబినేషన్ కోసం అంత నడిపించారుగా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల క్రితమే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న ఈ మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్లో ఎనిమిది భాషల్లో రూపొందించబోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతోన్నా.. షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ‘స్పిరిట్’ మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇది సిన్సియర్ కాప్ స్టోరీతో రాబోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. అదే సమయంలో ఇప్పటికే దర్థకుడు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌ను దాదాపుగా పూర్తి చేయడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా మొదలెట్టాడు. ఇప్పుడు ఈ మూవీ కాస్టింగ్ మీద సందీప్ వంగా ఫోకస్ చేసినట్లు తెలిసింది.
అయితే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుందని తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను దర్శకుడు ఆమెకు చెప్పాడట.. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో 2007లో ప్రభాస్ - నయనతార కాంబినేషన్లో యోగి సినిమా వచ్చిన విషయం తెలిసింది. ఇప్పుడు సీరియస్ పోలీస్ స్టోరీ తో వస్తున్న స్పిరిట్ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నిర్వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా వచ్చే సంవత్సరం మొదలు పెడతారని కూడా అంటున్నారు. ఇక మరి 17 సంవత్సరాల తర్వాత ప్రభాస్ తో నయయతార జోడి కడుతుందని వార్త ఇప్పుడు నేషనల్ వైట్ గా ట్రెండ్ అవుతుంది .