రెచ్చిపోయి రచ్చ చేసిన స్టార్ హీరోయిన్.. చివరకు వివాదంలో సినిమా..!
ఇక మన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో పిశాచి సినిమా కూడా ఒకటి.. ఇక ఈ సినిమాను మిస్కిన్ తెరకెక్కించాడు. ఈ సినిమా కోలీవుడ్ లో వచ్చి తెలుగులో డబ్ అయ్యింది. ఇదొక హారర్ క్రైమ్ డ్రామా.. పిశాచి సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న సిక్వేలలో చాలామంది అగ్ర నటులు నటిస్తున్నారు. పిశాచి 2 సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా ముఖ్య పాత్రలో నటిస్తుంది. అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఆండ్రియా ఎంతో బోల్డుగా కూడా నటించారని అంటున్నారు. అదేవిధంగా ఓ సన్నివేశం కోసం ఆండ్రియా ఈ సినిమాలో నగ్నంగా కూడా నటించారని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది. ఈ సినిమాను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ కంపెనీ ఆరోపిస్తుంది. ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. దాంతో డబ్బు చెల్లించిన తర్వాతే సినిమాను రిలీజ్ చేసుకోవాలని కోర్టు తెలిపింది. ఇక మరి ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకెన్ని వివాదాలు వస్తాయో లేక అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఆ దేవుడికే తెలియాలి.