టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన
యువ నటులలో అక్కినేని
నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే చివరగా
నాగ చైతన్య "థాంక్యూ" అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
విక్రమ్ కె
కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఈ
మూవీ తర్వాత
నాగ చైతన్య "దూత" అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ వెబ్ సిరీస్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి లభించింది.
ఈ వెబ్ సిరీస్ ద్వారా
నాగ చైతన్య కు
ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం చైతూ "తండెల్" అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు.
సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇకపోతే ఈ సినిమాను తెలుగు ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో పాన్
ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ
మూవీ కి అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ
మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను
నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు 40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఈ
మూవీ విడుదల అయిన కొన్ని వారాలకు ఈ
సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.