స్టార్ హీరోయిన్ బాత్రూం సీన్ వెనుక స్టార్ హీరో తండ్రి కుట్ర.. స్టార్ డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్ వైరల్..!

Amruth kumar
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల ల‌కి సంబంధించిన చాలా సన్నివేశాలు  ఎన్నో వివాదాలు అవుతూ ఉంటాయియి. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్ష‌కులకు ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటే సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరం లేకుండా వాటిని సినిమా నుంచి తొలగిస్తారు. గతంలో హీరోయిన్ల  గ్లామర్ షో అంటే హద్దులో ఉండేవారు. నగ్మా - రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా స్కిన్ షో చేసేవారు. అయితే అతి చిన్న వయసులో హీరోయిన్ అయిన దివ్యభారతి కూడా ఆ రోజుల్లో గ్లామర్ గట్టిగానే వల్కపోశారు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే దివ్యభారతి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో నటించే సమయంలో మాత్రం యువ‌త‌ను ఒక ఊపు ఊపేసింది. అలాగే దర్శక నిర్మాతలు కూడా ఆమె కాల్ షీట్లు కోసం ఎగబడ్డారు.

1990లో దివ్యభారతి - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో బొబ్బిలి రాజా సినిమాతో తెలుగులో ఆమె పరిచయమైంది. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో దివ్యభారతి క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఆ వెంటనే మోహన్ బాబు హీరోగా అసెంబ్లీ రౌడీ సినిమాలో ఈమె నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అలాగే సినిమాతో మోహ‌న్ భాబుకు కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా తెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాలను సీనియర్ దర్శకుడు బి గోపాల్ తెర్కక్కించడం ఇక్కడ మరో విశేషం. ఇక ఆ రోజుల్లో దివ్యభారతి ఈ సినిమాల్లో ఎంతో హాట్ గా కనిపించడంతో పాటు స్కిన్ షోలో కూడా రెచ్చిపోయి నటించడంపై అప్పుడు పెద్ద చర్చ జరిగింది.

ఇక బొబ్బిలి రాజా సినిమాలో ఒక సన్నివేశం జాకెట్ విప్పే సిన్‌ ఉంటుంది .. అసలు ఆ సన్నివేశాన్ని ఆ రోజుల్లో సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారా అని అంతా షాక్ అయ్యారు. అలాగే అసెంబ్లీ రౌడీ సినిమాలో దివ్యభారతి బాత్రూం సన్నివేశం పైన కూడా పెద్ద రచ్చే నడిచింది. ఈ సన్నివేశాలని సెన్సార్ వాళ్ళు ఎలా అనుమతించారు అనేది ఒక పెద్ద మిస్టరీగా మిగిలింది ఇప్పుడు ఎట్టకేలకు ఆ సన్నివేశాలని ఒకే అవటం వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనేది దర్శకుడు బి. బోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సెన్సార్ సమస్యలు ఏమైనా ఉంటే రామానాయుడు గారు మేనేజ్ చేసేవాళ్ళు. బొబ్బిలి రాజా చిత్రంలో జాకెట్ సన్నివేశాన్ని రామానాయుడు గారు సెన్సార్ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేశారు. ఆయన చెబితే ఇక తిరుగులేదు. సెన్సార్ వాళ్ళు ఆయన మాట వినేవారు. అదే విధంగా అసెంబ్లీ రౌడీ చిత్రంలో బాత్రూం సన్నివేశాన్ని మోహన్ బాబు గారు మేనేజ్ చేసినట్లు బి గోపాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: