పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్.. సడన్ గా ఇంత షాక్ ఇచ్చిందేంటి..?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చెప్పకుండా భలే షాక్ ఇస్తున్నారు . మరి ముఖ్యంగా కొంతమంది టాప్ మోస్ట్ హీరోయిన్స్ తమ లైఫ్ కి సంబంధించిన కీలక విషయాలను సడన్గా డెసిషన్ తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఒక వార్త అభిమానులకి ఫ్యుజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ "తమన్నా". టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .


మరీ ముఖ్యంగా తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో నటించేసింది. చిరంజీవి దగ్గర నుంచి నిన్న కాక మొన్న  ఇండస్ట్రీ లోకి వచ్చిన "సత్యదేవ్" వరకు అందరి యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని శభాష్ అనిపించుకుంది . తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . ఆ విషయాన్ని స్వయంగా ఇద్దరు కన్ఫామ్ చేశారు . కాగా త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త బాగా హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది.


సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా కూడా మారింది. ఇప్పుడే అప్పుడే పెళ్లి చేసుకోము అంటూ చాలా సందర్భాలలో చెప్పుకు వచ్చిన తమన్నా సడన్గా కుటుంబ సభ్యుల ఫోర్స్ చేస్తూ ఉన్న కారణంగా పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యిందట . పెళ్లికి ముందే ఇద్దరు చట్టపట్టాలేసుకొని తిరుగుతూ ఉండడంతో లేనిపోని రూమర్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కారణంగానే తమన్న ఇలాంటి నిర్ణయం తీసుకుందట . అంతేకాదు పెళ్లి ముహూర్త కూడా ఫిక్స్ చేసుకునేసిందట. త్వరలోనే తమన్నా- విజయ్ వర్మ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు అంటూ తెలుస్తుంది . దీనిపై తమన్న త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: