ఒళ్ళు మండిపోయే ప్రశ్న.. సూర్య సూపర్ కూల్ ఆన్సర్..!
ఆయన నటించిన "కంగువ" సినిమా నవంబర్ 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాన్ ఇండియా లెవెల్ లో తిరిగేస్తున్నాడు సూర్య. మరి ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు సూర్య అంటూ కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కాగా రీసెంట్గా కంగువ ప్రమోషన్ కోసం సూర్య బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు . ఈ క్రమంలోనే ఒక జర్నలిస్టు ఘాటైన క్వశ్చన్ నే అడిగాడు .
"అక్టోబర్ 10న రిలీజ్ చేయాల్సిన కంగువ సినిమాను రజనీకాంత్ కోసం వాయిదా వేసుకున్నారు ..ఇప్పుడు నవంబర్ 14వ తేదీ వస్తున్నారు. అదే డేట్ న శాండల్ వుడ్ స్టార్ శివ రాజ్ కుమార్ భైరతిరణగల్ అనే మూవీతో రాబోతున్నాడు . ఆ మూవీ ని మీరు లెక్క చేయలేదా..?" అంటూ ప్రశ్నించారు . అంతేకాదు కర్ణాటకలో ఎన్ని స్క్రీన్ వస్తాయో..? అంతే సంఖ్యలో శివన్న సినిమాకు తమిళనాడులో కేటాయిస్తారా ..? అంటూ చాలా లాజిక్ తో ప్రశ్న వేశాడు .
దీనికి సూర్య చాలా ఓపికగా సమాధానం చెప్పారు. "డిస్ట్రిబ్యూషన్. ఎగ్జిబిషన్ ఇవన్నీ నటనకు సంబంధం లేదు . ఒకవేళ తనకు అందులో ఏమాత్రం అవకాశం లభించిన సరే ఇలాంటి విషయాలు పట్ల ఖచ్చితంగా గొంతు విప్పి మాట్లాడుతాను. దానికి సరైన పరిష్కారం చూపుతాను . నేను కూడా శివన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను "అంటూ సూర్య చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు . నిజానికి ఆ ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్న రచ్చ రంబోలా అయిపోయేది. కానీ సూర్య మాత్రం తన తెలివితేటలతో చాలా ఓపికగా సమాధానం చెప్పి శభాష్ అనిపించుకున్నాడు..!!