మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ధమాకా మూవీ తర్వాత రవితేజకు ఒక్క విజయం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఈ సంవత్సరం ఇప్పటికే రవితేజ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం మొదటగా రవితేజ "ఈగల్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే రవితేజ తన నెక్స్ట్ మూవీని ఓ క్రేజీ బ్యానర్ లో చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మధ్య కాలంలో నిర్మిస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
ఈ బ్యానర్ లో రవితేజ తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నట్లు , ఈ సినిమాకు మ్యాడ్ మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ "మ్యాడ్" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న మ్యాడ్ స్క్వేర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రవితేజ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.