టాలీవుడ్
కింగ్ అక్కినేని
నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.
నాగార్జున ఆఖరుగా పోయిన సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ
సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్న
నాగార్జున ఇప్పటివరకు సోలో హీరోగా తాను చేసే నెక్స్ట్
మూవీ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
కాకపోతే ఈయన వరుస పెట్టి ఇతర సినిమాల్లో కీలక , ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం
నాగార్జున ,
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే
నాగార్జున అభిమానులు ఓ వైపు వరస పెట్టి ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాల్లో తమ అభిమానుల నటుడు కీలక పాత్రలో చేస్తున్నందుకు ఆనందపడుతున్న , మరో వైపు ఫుల్ క్రేజ్ ఉండి కూడా సోలో
హీరో సినిమా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నాడు అని నిరాశన వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు.
ఒక వేళ కుబేర , కూలి రెండు సినిమాలు మంచి విజయాలను సాధించినట్లయితే నాగార్జునకు మరిన్ని సినిమాల్లో కీలక పాత్రలలో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. మరి దాని వల్ల సోలో హీరోగా అవకాశాలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది అని పలుకులు అభిప్రాయ పడుతున్నారు. దానితో ఈ రెండు సినిమాలు హిట్ అయినా నాగార్జునకు కష్టాలు వచ్చే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.