శ్రీ లీలకు వార్నింగ్ ఇచ్చిన అల్లు ఫ్యామిలీ ?

Veldandi Saikiran
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల పైనే ఈ సినిమా షూటింగ్ ని తీశారు. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్, అల్లు అర్జున్ చాలా కష్టపడి ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన అద్భుతంగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే చేయాల్సి ఉందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించగా ఫైనల్ గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా.... పుష్ప2 సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లు అర్జున్ కమీట్ అయ్యారట.

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను అనుకున్నారట. త్రివిక్రమ్ సినిమా కథను శ్రీ లీలకు వినిపించగా ఈ బ్యూటీ అల్లు అర్జున్ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. తన డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లనే అల్లు అర్జున్ తో సినిమాను వదులుకుందట. తనకు కాల్ షీట్స్ లేకపోవడంతోనే సినిమా కథ ఎంతో నచ్చినప్పటికీ వదులుకోవాల్సి వచ్చిందని శ్రీలీల త్రివిక్రమ్ తో చెప్పిందట. అయితే ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ శ్రీ లీలకు ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది.

నా సినిమాను నువ్వు రిజెక్ట్ చేస్తావా అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. అల్లు అర్జున్ స్వయంగా ఫోన్ చేసి అడగడంతో శ్రీలీల సినిమా చేస్తానని చెప్పిందట. అంత పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే ఎలాగైనా చేయాలి అని నిర్ణయించుకుందట. ఇక అల్లు అర్జున్, శ్రీ లీల కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: