చిరంజీవిని ముద్దుగా తల్లి అంజనమ్మ అలా పిలుస్తుందా..? అందుకే అంతటి మెగాస్టార్ అయ్యాడు..!
చిరంజీవి అంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి చిరంజీవిని తన తల్లి అంజనమ్మ ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? ఖచ్చితంగా అది తెలుసుకున్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు . చాలామంది డబ్బు ఉన్న పిల్లలు.. డబ్బున్న వారు పెట్ నేమ్స్ తో పిలుచుకుంటూ ఉంటారు . పూర్తి పేరు పెట్టి ఎవరు పిలవరు . అయితే అంజనమ్మ మాత్రం చిరంజీవిని మొదట శివ శంకర వరప్రసాద్ అని.. అదేవిధంగా చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చాక చిరంజీవి అంటూ పిలుస్తుందట .
ఇప్పటికి కూడా ఆమె పూర్తిగా చిరంజీవి అంటూనే పిలుస్తుందట . నాన్నలు ..బుజ్జులు.. కన్నులు అంటూ పెట్ నేమ్స్ తో పిలవదట . తల్లిదండ్రులు జన్మ నక్షత్ర ప్రకారం పెట్టిన పేరును ఆ తల్లిదండ్రులు పిలిస్తే ఆ బిడ్డకి బాగా కలిసి వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయిన జనాలు ఇప్పుడు నాన్నలు ..బుజ్జులు అంటూ ముద్దు పేరుతో పిలుస్తున్నారు . పెట్టిన పేరుని మర్చిపోతున్నారు . కానీ అంజనమ్మ మాత్రం చిరంజీవా అంటూ పిలుస్తుందట. అందుకే మెగా స్టార్ చిరంజీవిగా ఎదిగాడు చిరంజీవి అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంజనమ్మ అంత ప్రేమగా పిలవడంతోనే ఆమెకు చిరంజీవి అంటే ఎంత ప్రేమ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఫాన్స్..!