కేటీఆర్‌ ఫోటోకు లైక్‌ కొట్టిన స్నేహా రెడ్డి?

Veldandi Saikiran
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. స్నేహ హీరోయిన్ కాకపోయినాప్పటికీ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం, అభినయం ఉంటుంది. స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా స్నేహ రెడ్డిని ఫాలో అవుతారు. స్నేహ సోషల్ మీడియాలో తన పిల్లలు, ఫ్యామిలీ, ఫుడ్ వీడియోలు, వెకేషన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

రోజు రోజుకి స్నేహారెడ్డి జోరు సోషల్ మీడియాలో భారీగా పెరుగుతోంది. హాట్ హాట్ గ్లామర్ ఫోటోషూట్లతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తోంది. రీసెంట్ గా ఇన్ స్టాలో ఓ రెండు ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మతులు పోగొడుతున్నాయి. పర్సనల్ లైఫ్ నీ దాటుకుని బయట ప్రపంచానికి తనను తాను కొత్తగా స్నేహ రెడ్డి పరిచయం చేసుకుంటుంది. సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని అందాల విందు చేస్తోంది.

అల్లు అర్జున్ సపోర్ట్ తో స్నేహారెడ్డి మోడల్ గా మారిపోతుంది. ఇద్దరు పిల్లల తల్లి అని ఎవరు నమ్మలేనంతగా తన అందాలతో అద్భుతాలు చేస్తోంది. ఓవైపు కుటుంబాన్ని, మరోవైపు తన ప్రొఫెషనల్ లైఫ్ నీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా వెకేషన్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది స్నేహ రెడ్డి. కాగా... అల్లు అర్జున్, స్నేహ రెడ్డి జంట ఎంతోమందికి ఆదర్శమని చెప్పాలి. వీరు ప్రేమించి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహ అనంతరం స్నేహ రెడ్డి తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతోంది. ఇక అల్లు అర్జున్ ఎప్పటిలాగే సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా.... స్నేహ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో కేటీఆర్ ఫోటోకు లైక్ కొట్టింది. సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకులు కేటీఆర్ తో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలకి స్నేహ లైక్ కొట్టింది. దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: