మెగాస్టార్ పై కోపంతో బాలకృష్ణ అంత పని చేశాడా.. చివరకు చిరునే నటసింహం ను రీమిక్స్ చేసే పరిస్థితి..!
అయితే గతంలో మన టాలీవుడ్లో డ్యాన్స్ లో నెంబర్ వన్ ఇప్పటికే చిరంజీవి నే అంటారు.. అయితే బాలయ్య చిరంజీవిని మించి డ్యాన్స్ చేయటం వెనక ఆ రోజుల్లో పెద్ద కారణమే ఉందట.. అందుకు ఆయన ఎన్నో అవమానాలు, ఫిజికల్ స్ట్రగుల్స్ కూడా ఉన్నాయట. ఆ రోజుల్లో చిరంజీవి డాన్సులకు పెట్టింది పేరు ఆయన సినిమాల్లో డాన్సులు గురించి ఎక్కువ చర్చ జరిగేది.. ఆ డ్యాన్సును చాలా మంది ఫాలో అయ్యేవారు . యూత్ అయితే ఊగిపోయి డాన్సులు చేసేవారు . అంత క్రేజీగా చిరంజీవి డాన్సులు ఉండేవంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలో బాలయ్య సరిగా డాన్సులు చేసేవారు కాదట.. దాంతో ఆయన ఎంతో బాధపడేవారుట చిరంజీవిలా తాను చేయలేకపోతున్నారని ఎంతో మదనపడేవాళ్లట.. పోటీలో తట్టు కోవాలంటే డాన్సులు నేర్చుకోవాలి అని ఆయన ఫిక్స్ అయ్యారట.
అయితే బాలకృష్ణ భోజనం ప్రియుడు.. నటరత్న ఎన్టీఆర్ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతో ఆయనకు సినిమా కష్టాలు పెద్దగా తెలియదు.. ఇక దాంతో ఆయనకి నచ్చినట్టు ఉండేవాడు .. కాస్త పొట్ట కూడా ఉండేది వాటి కారణంగా డాన్స్ చేయడానికి ఆయన ఇబ్బంది పడే వారట.. అలా కొన్నాళ్లు సినిమాలు చూసుకుంటూ వచ్చాడు. కానీ డాన్సుల విషయంలో తనకు ఏదో వెలితిగా ఉండేది దాంతో తానే మారాలని నిర్ణయించుకున్నాడు.. ఆహారాన్ని తగ్గించాడు రోజుకి ఒక్క పూట భోజనమే చేసేవాడు.. అంతేకాకుండా వర్కోడ్స్ ,ఎక్ససైజ్, మెడిటేషన్ వంటివి కూడా చేసేవాడు అలా నెమ్మదిగా తన బాడీ పై పట్టు వచ్చింది. అలా డాన్సులు కూడా ప్రాక్టీస్ చేశాడట .
ఈ క్రమంలో ఆయన సమరసింహారెడ్డి సినిమాలో అదిరిపోయే డాన్సులు చేశారు. ముఖ్యంగా అందాల ఆటబొమ్మ పాటకి ఆయన డాన్సులు మరో లెవల్. ఆ డాన్స్ విషయంలో అంతకు ముందే బాలయ్య వేరు, సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య వేరు అనేలా చేశారు. ఇప్పటికీ అదరగొడుతున్నాడు . అందాల ఆటబొమ్మ పాటకి కాశ్మీర్లో హీరోయినతో ఆయన వేసిన స్టెప్పులు బాగా పేలాయి. ఆడియెన్స్ లో ఫ్యాన్స్ కూడా ఊగిపోయారు. ఆ డాన్సులు చూసి చిరంజీవి కూడా షాక్ అయ్యారట . కాస్త జెలసీగా కూడా అయన ఫీలైనట్టు టాక్. ఇక దీంతో ఆ స్టెప్పులు బాగా నచ్చి తన సినిమాలో రీమిక్ కూడా చేశాడట చిరంజీవి. అన్నయ్య సినిమాలో సౌందర్యతో కాశ్మీర్లో అలాంటి డాన్సులనే కంపోజ్ చేయించుకుని చేశారు . అయితే వాటికి తనదైన స్టయిల్లో కొంత బెటర్మెంట్ చేసి కంపోజ్ చేశారు. అందులో చిరంజీవి కూడా అదరగొట్టారు. ఆ పాట కూడా బాగా ట్రెండ్ అయ్యింది. సో అలా బాలయ్య తన డాన్సుల్లో మెరుగు అయ్యారు. ఇప్పుడు రచ్చ చేస్తున్నారు .