మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమాలు చేసి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన హీరోయిన్లు వీళ్లే..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గురించి ఎంత స్పెషల్గా చెప్పుకున్న తక్కువే.. ప్రస్తుతం మన భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలలో చిరంజీవికి కూడా జాతీయ స్థాయిలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆరుపదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగాస్టార్.. అయితే చిరంజీవి సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు .. అలా నటించిన హీరోయిన్స్ లో కొందరు మరణించారు. అలా మరణించిన హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

ఇక చిరంజీవి కెరియర్ మొదటిలో ఆయనతో కలిసి నటించిన హీరోయిన్ జయలక్ష్మి.. అయితే ఈమె ఫటాఫట్ జయలక్ష్మి గా పేరుు తెచ్చుకున్నారు. ఈమె 22 సంవత్సరాల వయసులో లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ చేసుకొని చనిపోయింది. అలాగే చిరంజీవితో కలిసి నటించిన మరో నటి సుజాత ఈమె కూడా చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమె చిరంజీవికి చెల్లిగా హీరోయిన్గా అమ్మగా కూడా నటించింది. 2011లో అనారోగ్య సమస్యలతో చనిపోయింది. ఇక అలాగే చిరంజీవితో ఆడి పాడి  ప్రస్తుతం మన ముందులేని మరో నటి ఆర్తి అగర్వాల్.. ఈమె చిరంజీవితో కలిసి ఇంద్ర సినిమాల నటించింది. ఈ సినిమాలో స్నేహలతా రెడ్డి పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది కేవలం 31 సంవత్సరాల వయసులో బరువు తగ్గడానికి ట్రీట్మెంట్  వికటించడంతో ఈమె మరణించింది.

అలాగే చిరంజీవితో కలిసిన నటించిన మరో హీరోయిన్ దివ్యభారతి.. రౌడీ అల్లుడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.. సినిమాలో వీళ్ళిద్దరి జంటకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అతి చిన్న వయసులోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను ఈమె నటించింది. అయితే అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఐటమ్ సాంగులతో చిరంజీవితో నటించిన ప్రముఖ హీరోయిన్ సిల్క్ స్మిత. ఈమె చిరంజీవితో అగ్నిగుండం దొంగ, జ్వాలా ఖైదీ, ముఠామేస్త్రి వంటి పలు చిత్రాలలో నటించింది. ఈమె 35 సంవత్సరాలకే 1996లో అనుమానస్పదంగా మృతి చెందింది. ఈ లిస్టులో చెప్పుకోవలసిన మరొకటి మహానటి సౌందర్య .ఈమె చూడాలని ఉంది అన్నయ్య వంటి చిత్రాలలో చిరంజీవి గారితో కలిసి నటించింది. ఈమె మూడు పదుల వయసులోని కానరాని లోకాలకు వెళ్లింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: