సీనియర్ హీరోయిన్ సుహాసిని ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని చూసిందా.. అంత కథ నడిపించిందా..!
ఇక చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరో హీరోయిన్ల మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంటుంది .. అలానే సుహసినికి అప్పట్లో మరో హీరోయిన్ సుమలత మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం కారణంగా సుమలత మరో కన్నడ హీరో అంబరీష్ ని పెళ్లి చూసుకుంటున్న సమయంలో సుహాసిని వారికి అడ్డుపడిందట. అంతే కాకుండా ఆయన పెద్ద రౌడీలా ఉంటాడు నీకు అసలు సెట్ అవ్వడు నువ్వు ఎంతో సాఫ్ట్ నేచర్ కలిగిన అమ్మాయివి పెళ్లి చేసుకోకు అని చెప్పింది అట అయినా కూడా సుమలత నేను ఆయన్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నీ చావు నువ్వు చావు అని అక్కడే వదిలేసిందట.
అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కరోజు బెంగళూరు వెళ్లిన సుహాసిని సుమలత ఇంటికి కూడా వెళ్లిందట .. అయితే సుహాసిని ఇంటికి వెళ్లడంతోనే నటుడు అంబరీష్ ఏంటమ్మా నీకు నేను ఏమైనా అన్యాయం చేశానా..? ఎందుకు నా పెళ్లి చెడగొట్టాలని చూసావు? అయినా నీకు నేను రౌడీలా కనిపిస్తున్నానా అంటూ కడిగిపారేసారట. అయితే సరదాగా మాత్రమే అంబరీష్ సుహాసినిని అలా అడిగారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి నవ్వుకుంది సుహాసిని .