టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో మొదటగా స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.
ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అదిరిపోయే స్థాయిలో పెరిగింది. అలాగే రాజమౌళి క్రేజ్ కూడా ఈ మూవీ తో భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కడలేని కష్టాలు వచ్చాయి. అది ఎలా అనుకుంటున్నారా .? సింహాద్రి సినిమాతో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న తారక్ ఈ మూవీ తర్వాత వరస పెట్టి బారి అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు.
అలా చాలా కాలం పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుసగా అపజయాలను అందుకున్నాయి. అలా చాలా కాలం పాటు ఫ్లాప్ లను ఎదుర్కొన్న జూనియర్ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు విజయాన్ని అందుకున్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా భారీ కలక్షన్లను వసూలు చేసింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో తారక్ కి జోడిగా నటించింది.