టాలీవుడ్ స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ అద్భుతమైన స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితమే జనసేన అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఇక పార్టీని స్థాపించిన తర్వాత మొదటి సారి వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ బరిలోకి దిగలేదు. ఆ తర్వాత 2019 వ సంవత్సరంలో ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇక 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం , బిజెపి లతో పొత్తుల భాగంగా పోటీ చేసిన జనసేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
దానితో పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులలో కూడా కొనసాగుతున్నాడు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈయన ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టక ముందే కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి మూవీలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత హరిహర వీరమల్లు , ఓజి మూవీలను పవన్ స్టార్ట్ చేశాడు. అలాగే కొంత భాగం షూటింగులను కూడా పూర్తి చేశాడు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మాత్రం మొదలు పెట్టడం లేదు. ఇకపోతే ఈ సినిమాను మొదలు పెట్టకపోవడానికి ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేమిటి అంటే పవన్ మొదట హరిహర వీరమల్లు , ఓజి సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పూర్తి సమయాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ ప్రస్తుతానికి ఈ సినిమాను హోల్డ్ పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ పవన్ , హరీష్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.