బన్నీ లేకపోయుంటే కెరీర్ క్లోజ్ అయ్యేది.. దిల్ రాజు..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన గంగోత్రి సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా తోనే మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఆర్య సినిమాతో మరో విజయాన్ని అల్లు అర్జున్ అందుకున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు.

కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో దిల్ రాజు కు మీరు నిర్మాతగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో ఏదైనా సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా పెద్ద మొత్తంలో నష్టపోయారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి దిల్ రాజు సమాధానం ఇస్తూ ... నేను అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా నిర్మిస్తున్నాను. అదే సమయంలో తేజా హీరోగా రూపొందిన జై సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేశాను. ఇక సినిమా విడుదల అయింది. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ మూవీ ద్వారా నేను డిస్ట్రిబ్యూషన్ లో చాలా మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాను.

ఇక ఆ తర్వాత ఆర్య సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో నాకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. అలా ఆర్య సినిమా ద్వారా వచ్చిన లాభాలతో తేజ దర్శకత్వంలో రూపొందిన జై సినిమా నష్టాలను పూడ్చుకున్నాను అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇక ఆర్య మూవీ ద్వారా అల్లు అర్జున్ , సుకుమార్ , దిల్ రాజు వీరు ముగ్గురికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: