సాయి పల్లవిలో మరో కోణం.. పెళ్ళైన హీరో పై మోజు..?

Pandrala Sravanthi
ఏంటి సాయి పల్లవి ఆ పెళ్లయిన హీరో పై మనసు పడిందా..ఇంతకీ ఆ హీరో ఎవరు.. సాయి పల్లవి మనసు దోచేసిన ఆ హీరో ఎవరబ్బా అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే సాయి పల్లవి లాంటి హీరోయిన్ మనసు దోచింది ఎవరో కాదు తమిళనటుడు సూర్య..అవును మీరు వినేది నిజమే..సూర్య అంటే సాయి పల్లవి కి చెప్పలేనంత ఇష్టమట.. ఆ ఇష్టంతోనే సాయి పల్లవి సూర్యకి పెళ్లి అయింది అనే విషయం కూడా మర్చిపోయి తన క్రష్ అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే కాదు గతంలో కూడా ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో చాలాసార్లు బయట పెట్టింది.అయితే తన అభిమాని నటుడు సూర్యతో సాయి పల్లవికి ఎన్జీకే సినిమాలో నటించే అవకాశం వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో సూర్య భార్యగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇక ఈ సినిమా మాత్రమే కాదు అవకాశం ఇస్తే మరో సినిమాలో కూడా నటించడానికి సాయి పల్లవి సిద్ధంగా ఉందట. అయితే తన అభిమాన హీరో అయినా సూర్యతో నటించిన ఎన్.జి.కే సినిమా నిరాశ పరిచింది. ఎందుకంటే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.. అయితే సాయి పల్లవి తన క్రష్ సూర్య అనే విషయాన్ని ముందుగా బయట పెట్టలేదు. 

కానీ ఎన్. జీ.కే సినిమా డైరెక్టర్ ధనుష్ అన్నయ్య అయినటువంటి సెల్వ రాఘవన్ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని బయట పెట్టారు. సాయి పల్లవికి సూర్య అంటే చెప్పలేనంత ఇష్టం అంటూ చెప్పడంతో సాయి పల్లవి నిజమేనని తల ఊపింది.ఇక మేజర్ ముకుంద్ వరదరాజన్ ఆత్మకథగా తెరకెక్కిన అమరన్ మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా చూసిన చాలామంది బరువెక్కిన హృదయాలతో థియేటర్ నుండి వచ్చి రివ్యూలు ఇస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: