పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీలను మొదలు పెట్టాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలు కావడంతోనే ఈ మూడు సినిమాలను పక్కన పెట్టేసి పవన్ రాజకీయాలపై దృష్టిని పెట్టాడు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ పూర్తి అయ్యాయి. పవన్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతున్నాడు.
దానితో పవన్ తాను ఎలక్షన్లకు ముందు ఒప్పుకున్నా మూడు సినిమాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఓ వైపు రాజకీయాలతో బిజీగా సమయాన్ని గడుపుతూ వీలు దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. కొన్ని రోజుల క్రితమే పవన్ "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా నుండి ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ మూవీ యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ఇకపోతే సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ మూవీ షూటింగ్లో కూడా పవన్ మరికొన్ని రోజుల్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ లేని సన్నివేశాలను సుజిత్ తెరకేక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ తేరి కి రీమేక్ అని ఓ వార్త వైరల్ అయింది. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ డైరెక్టర్ దశరథ్ ఈ సినిమా తేరి మూవీకి రీమేక్ కాదు. అని ఏ సినిమాకు రీమేక్ కాదు అని చెప్పుకొచ్చాడు. దానితో ప్రస్తుతం పవన్ అభిమానులు కాస్త ఖుషి గా ఉన్నారు. మరి ఇది నిజంగా తేరి కి రీమేక్ అవునా కాదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.