గబ్బర్ సింగ్: "కెవ్వు కేక నా సామిరంగా" అంటూ యూత్ ని మెస్మరైజ్ చేసిన మలైకా.!!
- కెవ్వు కేక అంటూ కుర్రకారు ని తన వైపు తిప్పుకున్న బ్యూటీ..
- ముసలి వాళ్ళ నుండి చిన్నపిల్లల దాకా కెవ్వు కేక అంటూ..
ఇప్పటి జనరేషన్ యూత్ కి సినిమాల్లో మెసేజ్ కంటే ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు, ఐటమ్ సాంగ్స్ ఉంటేనే సినిమా చూడడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్ ఉంటే ఆ మూవీ మరింత హిట్ అవుతుంది. అలా ఎంతోమంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలా అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కెవ్వు కేక అంటూ ఐటెం సాంగ్ చేసి అందర్నీ మెప్పించింది.
కెవ్వు కేక నా సామి రంగ:
పవన్ కళ్యాణ్,శృతిహాసన్ కాంబోలో హరీష్ శంకర్ డైరెక్షన్లో బండ్ల గణేష్ నిర్మాతగా చేసిన గబ్బర్ సింగ్ మూవీ అప్పట్లో కుర్రకారుని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో "నాక్కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది..రాసుకోరా సాంబా" వంటి డైలాగులకు ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పడిపోయారు. ఇక ఈ సినిమా చూసి పవన్ అభిమానులే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. అలా చాలా సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న వేళ గబ్బర్ సింగ్ ఆయనకు మళ్ళీ ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శృతిహాసన్ ఓ లెక్కయితే ఐటమ్ సాంగ్ లో చేసిన మలైకా అరోరా మరో లెక్క అని చెప్పుకోవచ్చు.