టాలీవుడ్ స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ మణిశర్మ గురించి తెలుగు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అద్భుతమైన మ్యూజిక్
తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకున్నాడు..టాలీవుడ్ స్టార్ హీరోలందరికి
మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.గతంలో
మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ ట్రాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి..అలాగే
మణిశర్మ సాంగ్స్ తో పాటు,బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
కు కూడా చాలా మంది ఫ్యాన్స్ వున్నారు.ఆయన ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించి
టాలీవుడ్ టాప్ మ్యూజిక్
డైరెక్టర్ గా పాపులర్ అయ్యారు.
మణిశర్మ తన అద్భుతమైన మ్యూజిక్ కి ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. అయితే
మణిశర్మ మ్యూజిక్ అందించిన కొన్ని సినిమాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం)ను వింటుంటే ఇప్పటికీ మనకు గూస్ బంప్స్ వస్తాయి. అంతటి అద్భుతమైన బీజీఎంలను అందించిన ఘనత మణిశర్మదే..
మణిశర్మ అద్భుతమైన బీజీఎం అందించిన సినిమాల్లో
బాలకృష్ణ నరసింహ నాయుడు
సినిమా ఒకటి. ఈ
సినిమా బీజీఎం వింటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి. 2001లో వచ్చిన ఈ మూవీకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు..బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రమిది.
బాలయ్య ఎంట్రీకి
మణిశర్మ బీజీఎం తోడైతే థియేటర్స్ తగలబడాల్సిందే. అదేవిధంగా బాలకృష్ణకు
మణిశర్మ సంగీతం అందించిన చెన్నకేశవరెడ్డి
సినిమా కూడా మ్యూజిక్ పరంగా అద్భుత విజయం సాధించింది... ఈ
మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అద్భుతం అని చెప్పాలి. 2002లో వచ్చిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు..
ఇక
చిరంజీవి కెరీర్‌లోని భారీ విజయం సాధించిన చిత్రం ఇంద్ర.ఇంద్రసేనా రెడ్డిగా చిరు అందులో నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాకు
మణిశర్మ సంగీతం అందించారు. ఇంద్ర.. అంటూ సాగే టైటిల్ ట్రాక్ ఎప్పటికీ మర్చిపోలేము.ఇంద్ర సినిమాకు
మణిశర్మ ఇచ్చిన బీజీఎం కూడా అద్భుతంగా ఉంటుంది.ప్రతి డైలాగ్ కి వచ్చే బిజిఎం ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి. 2002లో విడుదలైన ఈ
సినిమా ఆల్ టైం
ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఇలా చిరు, బాలయ్యకే కాదు నేటి తరం స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, మహేష్, పవన్ కు
మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అందించారు..