డైరెక్టర్ పై కోపంతో సినిమానే చెయ్యను అని వెళ్లిపోయిన తారక్.. అంత కోపం ఎందుకు..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగించిన ఈయన ఓ దర్శకుడి విషయంలో మాత్రం అలిగి సినిమానే చేయను అని అన్నాడట. అది ఏ సినిమాలోనో ... అసలు ఎందుకు అలా తారక్ అన్నాడో తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సినిమా సమయంలో ఆయన వయస్సు చాలా తక్కువ. ఆ సినిమాలో ఆయన రాముడు పాత్రలో నటించాడు. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఓ సందర్భంలో గుణశేఖర్ పై అలిగి సినిమానే చేయను అన్నాడట. అసలు ఏం జరిగింది అంటే ... ఈ సినిమా షూటింగ్ సమయంలో రాముడు వీళ్ళు ఎత్తే సన్నివేశం కోసం గుణశేఖర్ రెండు విల్లులను చేయించాడట. ఒకటి డూప్లికేట్ విల్లు కాగా , మరొకటి టేకు కర్రతో చేయించారట. 

ఇక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కన ఆ రెండు విళ్లులను పెట్టారట. ఇక ఆ సమయంలో చిన్న వయసువాడు కావడంతో తారక్ ఆ రెండు విల్లులతో సరదాగా ఆడుకున్నాడట. ఇక అలా ఆడుకుంటున్న సమయంలో టేకు విల్లును విరగొట్టాడట. దానితో గుణశేఖర్ వచ్చి ఎందుకు ఇలా చేస్తావు అని గట్టిగా అనడంతో వెంటనే అలిగి నేను ఈ సినిమానే చెయ్యను అని అన్నాడట. ఆ తర్వాత మళ్లీ తారక్ సైలెంట్ అయ్యి సినిమా చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: