డాలర్ దెబ్బకు బంగారం ధరలు దిగబడిపోయాయి: ట్రంప్ గెలుపు ప్రభావమా?

Anilkumar
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. 270 ఎలక్ట్రోరల్ ఓట్లు గెరవాల్సి ఉండగా ట్రంప్ మ్యాజిక్ ఫింగర్ దాటేశారు దీనితో ఆయన విజయం సాధించారు. కాగా మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అంతటా జ్యూస్ నెలకొంది. అయితే బుధవారం రోజు ప్రపంచ స్టార్ మార్కెట్ భారీగా పుంజుకున్నాయి అంతేకాకుండా దేశీయ స్టార్ మార్కెట్ లు కూడా భారీగా లాభపడ్డాయి దానితో ఐటి టాప్స్ నాలుగు శాతం వరకు పెరిగిపోయాయని తెలుస్తోంది. ఇక వీటన్నిటికీ కారణం ఏదన్నా ఉందంటే కొద్ది రోజులుగా పతనం అవుతున్న డాలర్ ఒకటేసారి పుంజుకోవడం. డాలర్ ఈ రోజున భారీగా పెరిగిపోయి నాలుగు నెలల గరిష్టానికి చేరుకుందని తెలుస్తోంది దీనితో సాధారణంగా వాటితో సంబంధం ఉన్నవని ప్రభావితం అవుతున్నాయని తెలుస్తోంది. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది అని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో సాధారణంగానే డాలర్, గోల్డ్‌కు అవినాభావ సంబంధం ఉంటుంది అని అందరికీ తెలిసిందే. డాలర్ విలువ పెరిగే కొద్ది ఈక్విటీ మార్కెట్లు, బాండ్ ఈల్డ్స్‌కు జోష్ వస్తుంది.

 పెట్టుబడిదారులు వీటిపై భారీ  ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో బంగారంపై ఆసక్తి తగ్గుతూ పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధర తగ్గుతుంది. ఇకపోతే ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డాలర్ రికార్డు స్థాయికి చేరడం తో ఇంటర్నేషనల్ మార్కెట్లో కుప్పకూలింది. సాయంత్రం 6.50 గంటల సమయంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2675 డాలర్లకు పడిపోయింది. కిందటి రోజు ఇది 2740 డాలర్ల స్థాయిలో కదలాడిన సంగతి అందరికీ తెలిసిందే.  ఏకంగా 65 డాలర్లకుపైగా పతనమైందని తెలుస్తుంది. కాగా ఇప్పుడు పూర్తి ట్రేడింగ్ ఇదే విధంగా ఉంటే దేశీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ల తీరును బట్టే దేశీయంగా కూడా మారుతుంటాయి. టైమ్ జోన్ కారణంగా నిన్నటి రోజు ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే గురువారం ఉదయం 10 గంటల తర్వాత భారత మార్కెట్లలో బంగారం రేట్లు భారీ స్థాయిలో క్షీణించనున్నాయని తెలుస్తుంది. ఈ విషయం పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అదే విధం గా సిల్వర్ రేటు కూడా భారీ స్థాయిలో దిగొచ్చింది అని చెప్పవచ్చు. స్పాట్ సిల్వర్ ధర 32.50 డాలర్లపైన ఉండేది.

ఇప్పుడు అది 31.40 డాలర్లకు దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 73,650 వద్ద ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,350 వద్ద ఉంది. ఇదే వెండి ధర రూ. 1.05 లక్షల వద్ద ఉంది. అయితే బుధవారం రాత్రి 8.20 గంటల సమయంలో బంగారం ధర మరింత పతనమై ఔన్సుకు 2555 డాలర్లకు దిగొచ్చింది. ఇక్కడ చూస్తే ఒక్కరోజులో 85 డాలర్లకు పైగా పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన దేశీయ మార్కెట్లలో గురువారం రోజు రేటు భారీగానే దిగొచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. కొనుగోలుదారులకు పెళ్లిళ్ల సీజన్లో ఈ ధరల తగ్గింపు భారీ ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే దానిపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. అనేక కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ట్రంప్ గెలుపు బంగారం ధరలు పడిపోవడానికి ఒక ముఖ్య కారణం అయినప్పటికీ ఇది ఒక్కటే కారణం కాదు. భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: