టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఈయన కెరియర్ ప్రారంభంలో నిర్మించిన దాదాపు ప్రతి సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే నిర్మాతగా దిల్ రాజు కు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈయన తన కెరియర్లో ఎంతో మంది , దర్శకులను , నటులను , టెక్నీషియన్స్ ను వెండి తెరకు పరిచయం చేశాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం దిల్ రాజు నిర్మించిన సినిమాలు కెరియర్ ప్రారంభంలో అందుకున్న స్థాయి విజయాలను అందుకోవడం లేదు.
తాజాగా దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల తొమ్మిదవ తేదీన లక్నోలో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో దిల్ రాజు ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను తమిళనాడులో దిల్ రాజు తో పాటు ఆదిత్య రామ్ సంయుక్తంగా విడుదల చేయబోతున్నారు.
ఇలా దిల్ రాజు "గేమ్ చేంజర్" తమిళనాడు హక్కులను పూర్తిగా అమ్మి వేయకుండా తాను కూడా భాగస్వామ్యం ఉండడంతో కచ్చితంగా సినిమా కంటెంట్ లో గట్టి దమ్ము ఉండి ఉంటుంది లేకపోయి ఉంటే దిల్ రాజు సేఫ్ గా సినిమా మొత్తాన్ని ఎంతకో కొంతకు అమ్మివేసేవాడు. అలా చేయలేదు అంటే సినిమాలో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే కంటెంట్‌తో ఉండి ఉంటుంది అని చరణ్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.