అలా వైకుంఠపురములో నటుడు జయరాం భార్య.. స్టార్ హీరోయినా?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలా సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే అటు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సినీ సెలబ్రిటీల ప్రేమయనాలు పెళ్లిళ్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఒక నటుడు ఫ్యామిలీ గురించిన వార్త వైరల్ గా మారింది.

 సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న జయరాం గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో చూసిన కూడా జయరాం ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలా వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ నిజమైన తండ్రి పాత్రలో నటించిన జయరాం ఎంతలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క సినిమానేనా ఇలా ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు. హీరో హీరోయిన్ల తండ్రి పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేసి మెప్పించాడు అని చెప్పాలి.

 అయితే జయరాం గురించి చెప్పమంటే ఆయన చేసిన సినిమాల లిస్ట్ అందరూ చెప్పేస్తారు. కానీ ఆయన భార్య గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. జయరాం భార్య కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఆమె పేరు పార్వతి జయరాం. మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న డిమాండ్ అంతా కాదు. అప్పట్లో కేవలం ఈమెను చూసి కదిలి వెళ్లేవారు ప్రేక్షకులు. కానీ జయరాంతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది పార్వతి. 9 ఏళ్లలో ఏకంగా 70 కి పైగా సినిమాల్లో నటించింది. ఇక భర్త జయరాంతోనే కలిసి పదికి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించింది పార్వతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: