బ్లాక్ బస్టర్ టాక్.. కానీ లక్కీ భాస్కర్ కి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షే..?

Pulgam Srinivas
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన తెలుగులో నటించిన మహానటి , సీత రామం , కల్కి 2898 AD సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఈ నటుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాలో హీరో గా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటివరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లు వస్తే ఈ మూవీ ఫార్ములా ను తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

7 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6.94 కోట్లు , సీడెడ్ లో 1.77 కోట్లు , ఆంధ్ర లో 5.56 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ కి 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.27 కోట్ల షేర్ ... 23.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. లక్కీ భాస్కర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 15 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 73 లక్షల షేర్ కలక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: