చిత్ర పరిశ్రమలోనే హైయెస్ట్ విడాకులు.. భార్యలకు కోట్లు రాసిచ్చిన స్టార్లు వీరే..!

Amruth kumar
విదేశీ సంస్కృతి పర్యవసనం భారతదేశంలో ఇప్పుడు స్పష్టంగాా కనిపిస్తుంది. సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా చాలామంది స్టార్ కపుల్స్ విడాకులు తీసుకొని విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది జంటలు ఇప్పటికే విడాకులు తీసుకున్ని విడిపోయారు. అలాగే కోర్టు తీర్పు మేరకు తమ జీవిత భాగస్వామికి భరణంగా భారీ మొత్తంలో డబ్బుని కూడా చెల్లించాల్సి ఉంటుంది పిల్లల పోషణ ఎవరికైనా  తప్పనిసరి. మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ విడాకుల‌ నుండి హృతిక్ రోషన్ - సుస్సేన్ ఖాన్ వరకు.. బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకుల వివరాలు ఇక్కడ ఒకసారి చూద్దాం.

ఇక మన భారతదేశంలోని అత్యంత ఖరీదైన విడాకులు ఇవే.. హృతిక్ రోషన్ - సుహానే ఖాన్ 2014లో విడిపోయారు .. సుహానేకు భరణంగా 380 కోట్లు ఫైనల్ అయిందని కథనాలు వచ్చాయి. ఈ వార్తలను హృతిక్ రోషన్ ఖండిస్తూ వచ్చారు. అలాగే అమీర్ ఖాన్ తన భార్య రీనా నుంచి విడిపోయాక 50 కోట్లు భరణంగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. అలాగే సైఫ్ అలీ ఖాన్ నటి అమృత సింగ్ తమ 13 సంవత్సరాల దాంపత్య జీవితం విడిపోయిన తర్వాత.. ప‌టౌడీ సంస్థాన రాకుమారుడైన సైఫ్ తన మొదటి భారీ అమృతకు భరణంగా భారీ మొత్తంలో డబ్బులు ఆస్తులు రాసిచ్చారని వార్తలు కూడా వచ్చాయి.. ఆ మొత్తం ఎంత అనేది వారు ఇప్పటికీ చెప్పలేదు. సైఫ్ అలీ ఖాన్ సంపాదనలో దాదాపు సగం ఇచ్చేసారని బాలీవుడ్లో పలు గుసగుసలు వినిపించాయి. సైఫ్ త‌న భార్య‌కు రూ.5 కోట్లు భరణం ఇవ్వాలని వార‌సుడు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1 లక్ష ఇవ్వాల్సి ఉంటుంద‌ని కోర్టు తీర్పు వెలువ‌రించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

అలాగే బాలీవుడ్ మరో జంట సంజయ్ కపూర్ - కరిష్మా కపూర్ విడాకులు కూడా ఎంతో కాస్ట్లీ గానే ముగు సాయి.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఇక వీరు 13 సంవత్సరాల వైవాహిక బంధాన్ని మధ్యలోనే ముగించేశారు. సంజయ్ తండ్రి నివాసం ఉన్న ఇల్లు పై ఉన్న హక్కులను కరిష్మా తన పేరుకు బదిలీ చేయించుకుంది.. ఆమె బాండ్ల నుంచి నెలవారి పది లక్షలు వడ్డీని కూడా అందుకుంటుంది. తన పిల్లల మీద 14 కోట్ల డిపాజిట్లు కూడా చేసుకున్నారే...  మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే ఈ జంట 13 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా కలిసి ఉన్నారు. పెళ్ళికి ముందు ఇద్దరు ఐదేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. కాని  వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మలైకా 10 నుంచి 15 కోట్ల మీద భరణం తీసుకుందని అంటున్నారు.

నటుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ 16 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికారు. 2016 లో ఈ జంట‌ విడిపోయారు. ఫర్హాన్ నెలవారీ భత్యానికి బదులుగా వన్-టైమ్ భరణం మొత్తాన్ని చెల్లించాడు. అలాగే 10000 చదరపు అడుగుల భవనం `విపాసన`ను కూడా ద‌క్కించుకుంది. ఫ‌ర్హాన్ ఇటీవ‌ల మ‌రొక న‌టి శిభాని దండేక‌ర్ ని పెళ్లాడిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ లో నాగచైత‌న్య - స‌మంత జంట విడాకులు, భ‌ర‌ణం గురించి చాలా చ‌ర్చ సాగింది. ఈ బ్రేక‌ప్ అనంత‌రం అక్కినేని కుటుంబం నుంచి భారీ మొత్తాన్ని స‌మంత అందుకుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే సంపాద‌కురాలైన సామ్ త‌న మాజీ భ‌ర్త‌ చైతూ నుంచి ఏమీ ఆశించ‌లేద‌ని కూడా కొన్ని  క‌థ‌నాలొచ్చాయి. కానీ భ‌ర‌ణం వ‌గైరా అంశాల‌పై పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.  ఇలా మన చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ విడాకులు ఇచ్చిన స్టార్లుగా ఈ జంటలో మిగిలిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: